Samantha Wedding: సమంత సీక్రెట్ మ్యారేజ్.. ఈషా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితుల మధ్య వివాహం!
Samantha Wedding: అగ్ర కథానాయిక సమంత (Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Samantha Wedding: అగ్ర కథానాయిక సమంత (Samantha) వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. సోమవారం (నేడు) తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహ వేడుక రహస్యంగా జరిగినట్లు తెలుస్తోంది.
పెళ్లి సందర్భంగా సమంత ఎర్రచీరలో అద్భుతంగా ముస్తాబైనట్లు సమాచారం. ఈ రోజు సాయంత్రం, ఈ నూతన జంట తమ పెళ్లి విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా అభిమానులకు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రకటన కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.