Rashmika Mandanna: 'నటనకు పనికొచ్చే ముఖమేనా అన్నారు'.. ఎమోషనల్‌ అయిన రష్మిక..

Rashmika Mandanna career: కెరీర్‌ తొలినాళ్లలో అంత సులభంగా అవకాశాలు రాలేవని చెప్పుకొచ్చింది రష్మిక మందన్నా. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Update: 2024-08-14 02:30 GMT

Rashmika Mandanna: 'నటనకు పనికొచ్చే ముఖమేనా అన్నారు'.. ఎమోషనల్‌ అయిన రష్మిక..

Rashmika Mandanna: రష్మిక మందన్నా.. ఇప్పుడీ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. పుష్ప చిత్రంతో ఒక్కసారిగా నేషనల్ వైడ్‌గా పేరు సంపాదించుకుందీ బ్యూటీ. నేషనల్‌ క్రష్‌గా మారిపోయింది. ఛలో మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ చిన్నది అనతి కాలంలోనే అగ్ర కథానాయికల జాబితాలో చోటు దక్కించుకుంది. వరుస విజయాలను అందుకుంటూ క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. అయితే ఇదంతా ప్రస్తుతం కానీ కెరీర్‌ తొలినాళ్లలో తాను ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ప్రస్తుతం వచ్చిన ఈ స్టేటస్‌ అంత సులభంగా రాలేదని, అవమానాలు సైతం ఎదుర్కోన్నానని తెలిపింది.

కెరీర్‌ తొలినాళ్లలో అంత సులభంగా అవకాశాలు రాలేవని చెప్పుకొచ్చింది రష్మిక. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సినిమా అవకాశాల కోసం వెతుకుతోన్న సమయంలో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని పంచుకుంది. కొన్ని ఆడిషన్స్‌ వెళ్తే, నటనకు పనికి వచ్చే ముఖమేనా అన్న కామెంట్లు వినిపించాయని గతంలో ఎదురైన చేతు అనుభవాలను నెమరువేసుకుందీ బ్యూటీ.

ఆడిషన్‌కు వెళ్లిన చాలాసార్లు కన్నీళ్లతో ఇంటికి తిరిగి వచ్చానని, ఒక సినిమా కోసమైతే పదే పదే ఆడిషన్‌ చేశారని అయితే ఎట్టకేలకు ఆ మూవీలో సెలక్ట్‌ అయ్యానని చెప్పుకొచ్చింది. రెండు, మూడు నెలల పాటు ఆ సినిమాకు సంబంధించిన వర్క్‌షాప్స్‌ జరిగాయన్న రష్మిక, అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ ప్రాజెక్ట్‌ రద్దయిందని తెలిపింది. ఆ తర్వాత దాదాపు పాతిక ఆడిషన్స్‌లో రిజెక్ట్‌ చేశారన్న ఈ బ్యూటీ.. తన నటనపై వాళ్లకెప్పుడూ అనుమానం ఉండేదని, ఇలాంటి సవాళ్లను ఎన్నో ఎదుర్కొన్నాని వాపోయింది.

అయితే ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎప్పుడూ వెనక్కి తగ్గాలనుకోలేదని, ఆ కసితోనే ప్రతి సినిమాకు తనను తాను మెరుగుపరుచుకుంటూ వచ్చానని చెప్పుకొచ్చింది. తన సినిమాలు చూసిన ప్రతీ సారి ఇంకాస్త బాగు చేస్తే బాగుండేదనకుంటున్నానని మనసులో మాట బయటపెట్టేసింది. ఇదిలా ఉంటే రష్మిక ప్రస్తుతం ‘పుష్ప2’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దీంతో పాటు.. బాలీవుడ్‌లో విక్కీ కౌశల్‌తో ‘ఛావా’, సల్మాన్‌తో ‘సికిందర్‌’ వంటి మూవీస్‌లో నటిస్తోంది.

Tags:    

Similar News