Nivetha: 'ఇదిగో నా భర్త ఇతనే'.. అసలు విషయం బయటపెట్టిన నివేదా థామస్‌..!

Nivetha Thomas: 2008లో బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార నివేదా థామస్‌.

Update: 2024-07-04 07:41 GMT

Nivetha: 'ఇదిగో నా భర్త ఇతనే'.. అసలు విషయం బయటపెట్టిన నివేదా థామస్‌..!

Nivetha Thomas: 2008లో బాలనటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అందాల తార నివేదా థామస్‌. తమిళ, మలయాళ చిత్రాల్లో నటించిన ఈ చిన్నది తర్వాత 2016లో నాని హీరోగా తెరకెక్కిన జెంటిల్‌మెన్‌ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తొలి సినిమాతోనే తనదైన అందం, నటనతో మెస్మరైజ్‌ చేసిన ఈ చిన్నది. ఆ తర్వాత నిన్నుకోరితో బ్లాక్‌ బ్లస్టర్‌ను సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా విజయం తర్వాత యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌తో లవకుశతో పాటు పలు చిత్రాల్లో నటించింది. అయితే తాజాగా గత కొన్ని రోజులు తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది నివేథా. దాదాపు మూడేళ్ల నుంచి తెలుగులో ఒక్క సినిమాలో నటించలేదు. ఈ క్రమంలోనే తాజాగా నివేదా ఎక్స్‌ వేదికగా చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌ అయ్యింది. 'చాలా కాలమైంది బ‌ట్‌.. చివ‌రిగా కుదిరింది' అంటూ ల‌వ్ ఎమోజీతో పోస్ట్ చేసింది. దీంతో నివేదా పెళ్లి చేసుకోబోతోందని వార్తలు వైరల్‌ అయ్యాయి.

అయితే ఇదంతా సినిమా ప్రచారంలో భాగమని తర్వాత తేలింది. నివేదా నటిస్తున్న కొత్త సినిమా ‘35 చిన్న కథ కాదు’కు సంబంధించి ప్రమోషన్స్‌లో భాగంగా ఈ పోస్ట్ చేసింది. కాగా తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై స్పందించారు నివేదా.. '35 చిన్న కథ కాదు' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాను సోషల్‌ మీడియాలో ఓ ఫొటో పోస్ట్‌ చేశని, దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారని చెప్పుకొచ్చింది.

ఇక ఈ వార్తలకు సంబంధించిన ఫొటోను నివేదా అమ్మ కూడా పంపించారంటా.. అందుకు బదులిచ్చిన నివేదా.. ‘అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు’ అని అడిగానని తెలిపింది. కాగా ఈ సినిమాలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. ‘నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త. వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్‌, వరుణ్‌’ అని సరదాగా చెప్పుకొచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా వైరల్‌ అయిన నివేదా పెళ్లి వార్తలకు చెక్‌ పడినట్లు అయ్యింది. మరి మూడేళ్ల గ్యాప్‌ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు వస్తున్న నివేదా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. 

Tags:    

Similar News