Meena: ఆ హీరోని చాలా ప్రేమించా.. పెళ్లిరోజు నా మనసు విరిగిపోయింది..
Meena: ఆ హీరోని చాలా ప్రేమించా.. పెళ్లిరోజు నా మనసు విరిగిపోయింది..
Meena: ఆ హీరోని చాలా ప్రేమించా.. పెళ్లిరోజు నా మనసు విరిగిపోయింది..
Actress Meena: చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో అడుగుపెట్టి ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన నటి మీనా గత కొంతకాలంగా తల్లి పాత్రలు చేస్తూ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కమల్ హాసన్, రజినీకాంత్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, వంటి హీరోలందరితో కలిసి నటించింది. మీనా 2019లో బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త విద్యాసాగర్ ను పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. వీరికి నైనిక అనే పాప కూడా జన్మించింది.
నైనిక కూడా ఇప్పుడు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటిస్తోంది. గతేడాది మీనా భర్త అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే ఈ విషాదం నుంచి కోలుకుంటున్న మీనా మళ్లీ సినిమాల్లో నటిస్తూ ఆ బాధ నుంచి బయట పడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా మీనా ఒక తమిళ్ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. "పెళ్లికి ముందు ఒక బాలీవుడ్ హీరో అంటే నాకు పెద్ద క్రష్ ఉండేది. అలాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను అని మా అమ్మతో చెప్తూ ఉండేదాన్ని," అని అన్నారు మీనా.
ఆ బాలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు హృతిక్ రోషన్. "హృతిక్ రోషన్ ని నేను చాలా ప్రేమించాను. హృతిక్ లాంటి అబ్బాయి కావాలి అని మా అమ్మతో చెప్పాను. కానీ హృతిక్ పెళ్లి రోజు నా మనసు విరిగిపోయింది. అప్పటికి నాకు ఇంకా పెళ్లి కాలేదు," అని చెప్పుకొచ్చింది మీనా. ఇక సినిమాల పరంగా చూస్తే గతేడాది మోహన్ బాబు "సన్నాఫ్ ఇండియా" సినిమాలో నటించిన మీనా ఇప్పుడు పలు తమిళ్, మలయాళం సినిమాలతో బిజీగా ఉంది.