Hyderabad: షూటింగ్‌లో సినీనటుడు నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
Actor Nassar: ప్రముఖ సినీనటుడు నాజర్‌కు గాయాలయ్యాయి.
Hyderabad: షూటింగ్‌లో సినీనటుడు నాజర్‌కు గాయాలు.. ఆసుపత్రికి తరలింపు..
Actor Nassar: ప్రముఖ సినీనటుడు నాజర్‌కు గాయాలయ్యాయి. హైదరాబాద్‌లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో షూటింగ్ సందర్భంగా మెట్లు దిగుతున్న సమయంలో ఆయన జారిపడ్డారు. ఎడమ కన్ను కింద కణతి భాగంలో స్వల్ప గాయమై రక్తస్రావం కావడంతో వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. నాజర్‌తోపాటు సుహాసిని, మెహరీన్, షియాజీ షిండే షూటింగ్‌లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించారు నాజర్. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రేక్షకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.