Pawan kalyan Balakrishna Photo : బాలయ్యను లయన్ అంటూ నాగబాబు ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Pawan kalyan Balakrishna Photo : గత కొద్దిరోజులుగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.. తాజా పరిస్థితుల
nagababu, balakrishna
Pawan kalyan Balakrishna Photo : గత కొద్దిరోజులుగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.. తాజా పరిస్థితుల పైన ఎప్పటికప్పుడు తన యూట్యూబ్ ఛానల్లో లేదా ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లో లలో పోస్ట్ చేస్తున్నారు.. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ బాలకృష్ణకి సంబంధించిన ఓ పిక్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో వేదికగా పోస్ట్ చేశారు. వాస్తవానికి ఇది పాత పిక్ అయినప్పటికీ నాగబాబు పోస్ట్ చేయడంతో కాస్తా ఇంట్రెస్టింగ్ గా మారింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇంతకీ ఆ పిక్ ఏంటంటే.. సుస్వాగతం మూవీ ఓపెనింగ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న ఫోటో అది.. ఈ ఫొటోతో పాటుగా ఆసక్తికరమైన పోస్ట్ కూడా చేశారు నాగబాబు.. " బ్రదర్స్ టు గ్యాదర్.. ఒకరు సొంత బ్రదర్.. మరొకరు బ్రదర్ ఫ్రమ్ అదర్ మదర్ .. అని రాసుకొచ్చారు నాగబాబు... అలాగే పవర్ స్టార్ నందమూరి సింహాన్ని కలిసిన రోజుది అంటూ పోస్ట్ చేసాడు మెగా బ్రదర్. అంతటితో ఆగకుండా ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి, నా దగ్గర దాచానంతే.. అంటూ క్యాప్షన్ ఇచ్చారు నాగబాబు.. ఈ ఫోటో పట్ల అటు నందమూరి అభిమానుల ఇటు మెగా అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు..
ఇక ఎన్నికలకు ముందు టీడీపీ తో పాటుగా బాలకృష్ణ పై వ్యాఖ్యలు చేశారు నాగబాబు.. అంతేకాకుండా బాలయ్య ఎవరో తనకి తెలియదు అన్నారు.. ఇక పలుమార్లు తన యూట్యూబ్ ఛానల్లో బాలయ్య పై విరుచుకుపడ్డారు నాగబాబు.