మద్యం అమ్మకాలపై కమల్ ఘాటు వ్యాఖ్యలు

మద్యం అమ్మకాలు నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

Update: 2020-05-06 06:45 GMT
Kamal Hassan (File Photo)

మద్యం అమ్మకాలు నిర్ణయంపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ కరోనా వ్యాప్తి కట్టడికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు వృధా అయిపోయాయని ఆరోపించారు. ఆదాయ మార్గాల అన్వేషణలో మద్యం రేట్లు పెంచి దుకాణాల పున:ప్రారంభం చేయడంతో మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలపై తమిళ స్టార్ హీరో కమల్ హాసన్ స్పందించారు. లాక్ డౌన్, కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న తరుణంలో మద్యం అమ్మకాల నిర్ణయాన్ని తప్పుపట్టారు. మద్యం దుకాణాలను తిరిగి ప్రారంభించి ప్రజా ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారంటూ కమల్ హాసన్ విమర్శించారు. దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుంటే.. నిబంధనలను మరింత కఠినం చేయాల్సింది. అలా కాకుండా మద్యం షాపులు తెరవడం దారుణమైన చర్య అని కమల్ మండిపడ్డారు.

మద్యం దుకణాల వద్ద ప్రజలు గుమిగూడకుండా సామాజిక దూరం పాటించే అవకాశం ఉండదని, దీనివల్ల ఆ వ్యక్తికే కాకుండా ఆ కుటుంబం మొత్తం కూడా కోవిడ్ బారిన పడే అవకాశం ఉందన్నారు. తమిళనాడులో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్ణయాన్ని విరమించుకోవాలని అన్నారు. మే 7 నుంచి తమిళనాడులో మద్యం షాపులు ఓపెన్ చేస్తుండడం పై కమల్ విమర్శలు చేశారు.


Tags:    

Similar News