Gopichand: థియేటర్లను ఏది భర్తీ చేయదు అంటున్నా "గోపీచంద్"

* ఓటీటీల పై కామెంట్స్ చేసిన గోపీచంద్

Update: 2021-09-09 13:00 GMT

సీటిమార్ పోస్టర్ (ట్విట్టర్ ఫోటో)

Gopichand: కరోనా కారణంగా థియేటర్లు బాగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అందరూ ఓటీటీలలో సినిమాలు చూడడానికి అలవాటు పడ్డారు. చాలాకాలం పాటు థియేటర్లు మూత పడి ఉండడంతో ఓటీటీ ప్రేక్షకులకు దిక్కయింది. అందుకే స్టార్ నిర్మాతలు, నటీనటులు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ పై మొగ్గు చూపిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న కొన్ని సినిమాలు కూడా అదే ఓటీటీలలో దారిలోనే వెళుతున్నాయి. తాజాగా ఓటీటీ గురించి గోపీచంద్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం గోపీచంద్ తన తదుపరి సినిమా అయిన "సీటిమార్" ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ "ప్రతి నిర్మాత తన సినిమా థియేటర్ లోని విడుదల చేయాలి అనుకుంటారు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల వాళ్లు ఇబ్బందుల పాలవుతారు. ఫైనాన్స్ తీసుకుని సినిమాలు చేసే నిర్మాతలు ఆరేడు నెలల్లో విడుదల చేయాలనుకుంటారు కానీ ఆలస్యమయ్యే కొద్దీ వాళ్ళకి వడ్డీల భారం పెరుగుతూ ఉంటుంది.

కాబట్టి వాళ్ళ పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఓటీటీలలో విడుదల కాబోతున్న సినిమాల గురించి నేను కామెంట్ చేయను. వాళ్ళ స్థానంలో ఉండి ఆలోచిస్తే అసలు విషయం ఏంటి అని అర్థమవుతుంది. ఓటీటీ నిజంగా ఒక మంచి ప్లాట్ఫాం. భవిష్యత్తులో మరింత ఆదరణ ఉంటుంది కానీ థియేటర్ లను ఏదీ ఎప్పటికీ భర్తీ చేయలేదు" అని చెప్పుకొచ్చారు గోపీచంద్.

Tags:    

Similar News