Prabhas : ప్రభాస్ మూవీలో బాలీవుడ్ హీరో.. ఇక కెవ్వుకేక అంతే
ఇటీవల కాలంలో బాలీవుడ్ నటులు దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ల జాబితాలోకి ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ చేరుతున్నారు. అతనే అభిషేక్ బచ్చన్.
Prabhas : ప్రభాస్ మూవీలో బాలీవుడ్ హీరో.. ఇక కెవ్వుకేక అంతే
Prabhas : ఇటీవల కాలంలో బాలీవుడ్ నటులు దక్షిణాది సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు. సంజయ్ దత్, సైఫ్ అలీ ఖాన్, ఆమిర్ ఖాన్ లాంటి స్టార్ల జాబితాలోకి ఇప్పుడు మరో స్టార్ యాక్టర్ చేరుతున్నారు. అతనే అభిషేక్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ తర్వాత, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా ప్రభాస్ సినిమాలో నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ప్రభాస్ సినిమా కల్కి 2898 ADలో అమితాబ్ బచ్చన్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ తండ్రీకొడుకులు ఇద్దరూ ప్రభాస్ సినిమాల్లో నటించడం హాట్ టాపిక్‌గా మారింది. అమితాబ్ తర్వాత ఇప్పుడు ఆయన తనయుడు అభిషేక్ బచ్చన్ కూడా ప్రభాస్ సినిమాలో నటించనున్నాడనే వార్త సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రభాస్ ప్రస్తుతం ఫౌజీ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది స్వాతంత్ర్యానికి ముందు జరిగే ఒక ప్రేమకథ. ఈ సినిమాను బ్లాక్‌బస్టర్ హిట్ సీతారామం దర్శకుడు రఘు హనుపుడి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలకమైన, అతిథి పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పాత్ర చిన్నదే అయినప్పటికీ కథలో చాలా ముఖ్యమైనదిగా ఉంటుందని తెలుస్తోంది.
చిత్ర యూనిట్ ఇప్పటికే అభిషేక్ బచ్చన్‌తో చర్చలు జరిపింది. అతనికి కథ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారని సమాచారం. త్వరలోనే అభిషేక్ బచ్చన్ ఫౌజీ షూటింగ్‌లో పాల్గొంటారని సినీ వర్గాలు చెబుతున్నాయి. తెలుగులో అభిషేక్ బచ్చన్ నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడం విశేషం. ప్రస్తుతం అభిషేక్ షారూఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్, రాజా శివాజీ సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఒకవైపు 'ఫౌజీ' షూటింగ్‌లో పాల్గొంటున్న ప్రభాస్, ఇతర సినిమాలతో కూడా చాలా బిజీగా ఉన్నారు. దీ రాజా సాబ్ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతికి విడుదల కానుంది. ఫౌజీ కూడా వచ్చే ఏడాదే విడుదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ ఈ ఏడాది నవంబర్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కల్కి 2898 AD 2 సినిమా తర్వాత సలార్ 2 సినిమా షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. ప్రభాస్ ఒకేసారి ఇన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉండటం అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది.