Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020: హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-12 02:45 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-12 14:41 GMT

 టీఎస్ హైకోర్టు.....

- పిల్ ధాఖలు చేసిన రాజాస్వామి...

- ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా చట్ట వ్యతిరేకంగా నలుగురు ఆర్టీఐ కమిషనర్ల ను నియమించిందని కోర్టుకు తెలిపిన పిటీషనర్ తరపు న్యాయవాది రాపోలు    భాస్కర్..

- నారాయణ రెడ్డి, సైఫుల్లాఖాన్, కట్టా శేఖర్ రెడ్డి, శంకర్ నాయక్ లను ఆర్టీఐ కమిషనర్లు గా నియమించిందన్న పిటీషనర్ తరపు న్యాయవాది.

- వీరి నియామకాన్ని రద్దు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలన్న న్యాయవాది రాపోలు భాస్కర్.

- ఆర్టీఐ కమిషనర్ల నియామకం పై ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

- రెండు వారాల్లో పూర్తి వివరాలు తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.

- తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసిన హైకోర్టు.

2020-11-12 14:34 GMT

  ఆదిలాబాద్ 

- రహస్యంగా కీలకమైన డాక్యుమెంట్లు పరిశీలిస్తున్నా అదికారులు

- స్కాలర్ షిప్ సంబందించిన. పైళ్లను పరిశీలిస్తున్నారని సమాచారం.

- విషయం బయటకు చెప్పడానికి తనిఖీలు చేస్తున్నా అదికారులు

2020-11-12 14:32 GMT

ప్రగతి భవన్....

- సీఎం కేసీఆర్ తో సమావేశం అయ్యే అవకాశం..

- దాదాపు 6 గంటలుగా మంత్రులు, ప్రధాన కారుదర్శులతో కొనసాగుతున్న సీఎం కేసీఆర్ సమావేశం...

2020-11-12 13:47 GMT

నల్గొండ :

-నిడమనూరు లో వరద నష్టం వల్ల బాధితులకు న్యాయం చేయాలని తహాశీల్దార్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్లిన టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి...

-అక్కడే ఉన్న టిఆర్ఎస్ డిసిసిబి డైరెక్టర్ అంజయ్య కు డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్ మధ్య వాగ్వాదం... తోసేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు....

2020-11-12 05:05 GMT

నిజామాబాద్ :

-మంజీర వంతెన పిల్లర్లు అరిగిపోవడం, మూడో నెంబర్ పిల్లర్ పక్కకు ఓరగడంతో రాకపోకలు నిషేధం విధించిన మహా ఇంజినీర్లు.

-పాత వంతెన పై రాకపోకలు సాగించాలని సూచన.

2020-11-12 05:04 GMT

జనగామ జిల్లా:

-సన్న బియ్యంకు మద్దతు ధర ఇవ్వాలని ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో జిల్లాలో కొనసాగుతున్న అరెస్టుల పరంపర..

-ముట్టడికి వెళ్లకుండా ముందస్తుగా 50 మంది బిజెపి పార్టీ శ్రేణులను అరెస్టు చేసిన జనగామ పోలీసులు...

2020-11-12 05:01 GMT

హైదరాబాద్..

- అంబర్ పేట్ ప్రధాన రహదారి పై ఆర్టీసీ సిటీ బస్ ఢీకొని బైక్ పై వెళ్తున్న ఒక వ్యక్తి మృతి...

- అంబర్ పేట్ నుండి రామంతపూర్ వెళ్తుండగా బస్ వెనుక టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తి...

2020-11-12 04:59 GMT

గ్రేటర్ హైదరాబాద్..

# గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

# నేడు 11 గంటలకు రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది.

# గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీల ప్రతినిధులతో కమిషనర్ పార్థసారథి విడివిడిగా భేటీ కానున్నారు.

# ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు కానున్నారు.

# ఒక్కో పార్టీకి 15 నిమిషాలు మాట్లాడే అవకాశం కల్పించారు.

# వార్డుల వారీగా ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఖరారు, ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పై చర్చ

# పోటీ చేసే అభ్యర్థుల వ్యయం, చెల్లించాల్సిన డిపాజిట్ సహా ఇతర అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

# ఓటర్ల జాబితా ముసాయిదాను ఇప్పటికే ప్రకటించింది.. అభ్యంతరాలు స్వీకరిస్తుంది.

# పోలింగ్ కేంద్రాల ఖరారుకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ జారీ చేసింది.

# వీటితో పాటు ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా పార్టీల ప్రతినిధులతో ఎస్ఈసీ చర్చించనుంది.

2020-11-12 04:56 GMT

ప్రగతి భవన్..

-మధ్యాహ్నం 12 గంటలకు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ.

-మంత్రులతో భేటీ లో గ్రేటర్ ఎన్నికలతో పాటు రాష్ట్రంలో పంటనష్టం పై చర్చ .

-ఆ తరువాత పార్టీ జనరల్ సెక్రెటరీలతో సీఎం కేసీఆర్ సమావేశం.

-గ్రేటర్ ఎన్నికల వ్యూహం పై చర్చ

2020-11-12 03:47 GMT

నిజమాబాద్ :

-నగరంలోని బోయి గల్లీలో అక్రమంగా దేశీ దారు మద్యం అమ్ముతున్న ఇంటి పై ఎక్సైజ్ పోలీసుల దాడి.

-186 క్వార్టర్ బాటిళ్లు , 25 ఫుల్ బాటిల్స్ దేశీ దారు మద్యం స్వాధీనం.

-నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు.

Tags:    

Similar News