Live Updates: ఈరోజు (12 నవంబర్, 2020 ) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

ఈరోజు బ్రేకింగ్ న్యూస్, 12 నవంబర్, 2020 : హెచ్ఎంటీవీ లైవ్ బ్లాగ్ ద్వారా తాజా వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం అందిస్తుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వార్తా విశేషాలను, తాజా సమాచారాన్నిఎప్పటికప్పుడు మీకోసం బ్రేకింగ్ గా ఇస్తున్నాం.

Update: 2020-11-12 02:42 GMT

ఈరోజు పంచాంగం

ఈరోజు గురువారం | 12 నవంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | నిజ ఆశ్వయుజ మాసం | కృష్ణపక్షం | ద్వాదశి సా.6-24 తదుపరి త్రయోదశి | హస్త నక్షత్రం రా.12-04 తదుపరి చిత్త | వర్జ్యం ఉ.9-25 నుంచి 10-56 వరకు | అమృత ఘడియలు సా.6-26 నుంచి 7-56 వరకు | దుర్ముహూర్తం ఉ.9-51 నుంచి 10-36 వరకు, తిరిగి మ.2-21 నుంచి 3-06 వరకు | రాహుకాలం మ.1-30 నుంచి 3-00 వరకు | సూర్యోదయం: ఉ.06-06 | సూర్యాస్తమయం: సా.05-21

ఈరోజు తాజా వార్తలు

Live Updates
2020-11-12 14:45 GMT

 తూర్పుగోదావరి :

 కొత్తపేట

-కోవిడ్ ఆంక్షల నేపధ్యంలో నలుగురికి మాత్రమే అనుమతులు జారీ చేసిన అధికారులు..

-నిబంధనలు ఉల్లంఘిస్తూ పదుల సంఖ్యలో వెలసిన అక్రమ బాణాసంచా దుకాణాలు..

-భధ్రత ప్రమాణాలు గాలికి వదిలేసిన వ్యాపారులు.. పట్టించుకోని ఫైర్, పోలీస్, రెవెన్యూ అధికారులు..

2020-11-12 13:44 GMT

విజయవాడ..

-దివ్య తేజస్విని హత్య కేసులో నాగేంద్ర కష్టడీ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం

-ఆర్డర్స్ వచ్చే సోమవారానికి రిజర్వ్ చేస్తూ జిల్లా కోర్టు ఆదేశాలు

-అరెస్టు చేసి రిమాండ్ లో ఉన్న నాగేంద్రను వారం రోజులు కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన బెజవాడ పోలీసులు

2020-11-12 13:41 GMT

తిరుమల..

-శ్రీవారి కళ్యాణోత్సవం, డోలోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకరణ సేవలు

-రేపు ఉద‌యం 11.00 గంట‌ల‌కు టీటీడీ ఆన్ లైన్ (వ‌ర్చువ‌ల్‌) కోటాను విడుదల

-ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఈ సేవ టికెట్లు బుక్ చేసుకోవాలి

-తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ కోటాను ప్ర‌తి నెల చివ‌రి వారంలో టీటీడీ విడుద‌ల చేస్తుంది.

-శ్రీ‌వారి దర్శనం కోటాను, దర్శనం స్లాట్‌లను క్రమబద్ధీకరిస్తూ రోజువారి దర్శనం టోకెన్ల‌ను భ‌క్తుల‌కు మంజారు

2020-11-12 04:44 GMT

 విశాఖ..

-శ్రీలంక తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుండి 1.5 km ఎత్తు వరకు కొనసాగుతున్న ద్రోణీ...

-దీని ప్రభావంతో ఉత్తర కోస్తా లో భారీ వర్షాలు

-తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులపాటు అక్కడ అక్కడ వర్షాలు..

-ఉత్తరాంధ్ర తీరం వెంబడి గంట కు 45-55 కీ మీ వేగం తో గాలులు...

-16,17 తేదీల్లో కోస్తాంధ్ర లో వర్షాలు..

2020-11-12 04:41 GMT

తిరుమల..

-భారత దేశంలోనే సహజ వనరులు ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్వామి వారు ఆశీర్వదించాలి.

-రాష్ట్రాన్ని నెంబరు 1 రాష్ట్రంగా తీర్చిద్దాడానికి అనేక రంగాలు ఉన్నాయి.

-రాయలసీమను రత్నాల సీమగా, ఉత్తరాంధ్రలో అద్భుతమైన భూ సంపద, మధ్యాంద్రలో నీటి వనరులు ఉన్నాయి.

-ఇంతటి మంచి వనరులు కలిగిన ప్రాంతాన్ని రాష్ట్ర అభివృద్ధికి పాలకుల మనస్సులో వుండాలని స్వామి వారిని కోరుకున్నా.

-స్వామి వారి సొమ్ముపై ప్రభుత్వాల కన్ను పడుతున్నాయి, వారి కళ్ళు ప్రజలు ఇచ్చే కానుకలపై పడకూడదు.

-ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి , పరిపాలకులకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని స్వామి వారిని ప్రార్ధించాను - సోమువీర్రాజు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు

2020-11-12 04:36 GMT

విశాఖ...

-కూలీలను తీసుకు వెళ్తున్న రైలీంగ్ ను ఢీ కొని బొలెరో బోల్తా.

-ఘటనా స్థలంలోనే ఇద్దరు కూలీలు మృతి, మరో ముగ్గురుకి తీవ్ర గాయాలు.

-పనులు ముగించుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం. మృతులను తాడిచెట్ల పాలెంకు చెందిన మోహన్,గాజువాకకు చెందిన శేఖర్ గా గుర్తింపు.

-గాయపడ్డ బాధితులను ఆసుపత్రికి తరలించిన పోలీసులు .

2020-11-12 03:41 GMT

కడప :

-రైల్వే గేటును ఢీకొని, ఇంట్లోకి దూసికెళ్లిన లారీ...

-లారీ డ్రైవర్ అక్కడిక్కడే మృతి..

-తప్పిన పెను ప్రమాదం..

-క్రేన్ సహాయంతో లారీని తీస్తున్న పోలీసులు..

2020-11-12 03:40 GMT

గుంటూరు..

-అప్పర్ క్యాస్ట్ వాళ్లు మనని వాడుకొంటున్నారంటూ ఫోన్ ఆడియో...

-ఆడియోలో రెడ్డి సామాజిక వర్గాన్ని తూరుపారపట్టిన శ్రీదేవి.

-ఎస్సీలు, బి.సి.లు ఒకటిగా ఉండాలి రెడ్లు అనేవాళ్లు డేంజర్ అంటున్న శ్రీదేవి.

-స్థానిక నేతలతో తనకు ఉన్న విభేదాలను భయట పెట్టినట్లు ఉన్న ఆడియో...

2020-11-12 03:35 GMT

కర్ణాటక:

-బెంగళూరులో లష్కరే తోయిబా అనుమానిత తీవ్రవాది సయ్యద్ ఎం ఇద్రీస్ అరెస్టు

-ఆన్లైన్లో తీవ్రవాద శిక్షణ పొందేందుకు యువత ను ఎంపిక చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ ఐ ఏ

-యువకులను స్లీపర్ సెల్స్ గా వినియోగించుకుంటున్నారని గుర్తించిన అధికారులు

2020-11-12 03:25 GMT

నెల్లూరు:

-- ఇన్ ఫ్లో 9970 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 6750 క్యూసెక్కులు.

-- ప్రస్తుత నీటి మట్టం 74.915 టీఎంసీలు. పూర్తి నీటి మట్టం 77.988 టిఎంసిలు.

Tags:    

Similar News