Live Updates:ఈరోజు (ఆగస్ట్-10) ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ న్యూస్!

Update: 2020-08-10 01:04 GMT
Live Updates - Page 2
2020-08-10 14:02 GMT

అగ్ని ప్రమాదంపై జేసీ నేతృత్వంలోని కమిటీ.

విజయవాడ: స్వర్ణప్యాలస్ అగ్ని ప్రమాదం స్థలాన్ని పరిశీలించేందుకు వచ్చిన జేసీ నేతృత్వంలోని కమిటీ.

కమిటీలో ఉన్న ఐదుగురు సభ్యులు ఘటనాస్థలానికి చేరిక.

ప్రమాదం జరిగిన 3 ఫ్లోర్ లను పరిశీలించిన కమిటీ సభ్యులు.

ఘటనపై అదే విధంగా భద్రతా ప్రమాణాలపై లోతైన విచారణ చేస్తున్న కమిటీ సభ్యులు.

48 గంటల్లో కమిటీ నివేదిక సమర్పించాలి అని ప్రభుత్వం అదేశంతో దర్యాప్తుని వేగం పెంచిన కమిటీ సభ్యులు. 

2020-08-10 13:59 GMT

శేషాపురం అటవీ పరిసరాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం

తిరుపతి: చంద్రగిరి మండలంశేషాచల అటవిసమీప పంటపొలాలపై ఏనుగులు దాడులు.

శేషాపురం అటవీ పరిసరాల్లో ఏనుగుల గుంపు స్వైరవిహారం

కందులవారిపల్లి, శేషాపురం పంట పొలాలపై దాడి.

భయాందోళనకు గురవుతున్న రైతులు, స్థానికులు.

2020-08-10 13:57 GMT

వైఎస్ జగన్ ను కలిసిన ఎమ్మెల్సీ జకియా ఖానం

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మర్యాదపూర్వకంగా సీఎం క్యాంప్ కార్యాలయం లో కలిసి కృతజ్ఞతలు తెలిపిన నూతన ఎమ్మెల్సీ జకియా ఖానం

హాజరైన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

2020-08-10 13:55 GMT

యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు

జాతీయం: యాంబియన్స్ గ్రూపు కంపెనీపై సీబీఐ దాడులు

ఢిల్లీ, గురుగాం, పంచకుల, చండీగఢ్‌లలో ఏకకాలంలో సోదాలు

రూ. 800 కోట్ల బ్యాంకు రుణాల ఎగవేత కేసులో యాంబియన్స్ గ్రూపుపై ఈడీ కేసులు

గురుగాంలోని యాంబియన్స్ మాల్ నిర్మాణం విషయంలో అక్రమాలపై కేసులు నమోదు

నివాస స్థలాన్ని వాణిజ్య స్థలంగా మార్చడంపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని ఆదేశించిన హైకోర్ట్

హైకోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన సీబీఐ

యాంబియన్స్ గ్రూపు అధినేతగా ఉన్న రాజ్ సింగ్ గెహ్లోత్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్‌తో సంబంధాలు కలిగిన రాజ్ సింగ్

అక్రమ మార్గాల్లో రుణాలు సేకరించి, నిధులు దారి మళ్లించినట్టు అభియోగాలు

తప్పుడు కంపెనీలను సృష్టించి లావాదేవీలు నిర్వహించినట్టు ఆరోపణలు

అక్రమాలపై విడివిడిగా దర్యాప్తు చేస్తున్న సీబీఐ, ఈడీ సంస్థలు

2020-08-10 13:53 GMT

విజయవాడ ఘ‌ట‌న‌పై మ‌రో రెండు కమిటీలు

విజయవాడ: కోవిడ్ డాక్టర్లు ఇచ్చిన మెకానిజం అనుసరించారా అనేది పరిశీలిస్తున్నాం

ఈ ప్రమాదం పరిశీలించడానికి జాయింట్ కలెక్టర్ చైర్మెన్‌గా కమిటీ

ఇప్పటి వరకూ పరిశీలనలు పూర్తయ్యాయి

రాష్ట్ర స్ధాయిలో మరో రెండు కమిటీలు 

రమేష్ హాస్పిటల్ వద్ద ఎలా అడ్మిట్ చేసుకుంటున్నారు అనేది పరిశీలన  pai  

రెండు రోజుల్లో పూర్తి నివేదిక కలెక్టర్ గారికి అందిస్తాం

2020-08-10 13:53 GMT

విజయవాడ ఘ‌ట‌న‌పై మ‌రో రెండు కమిటీలు

విజయవాడ: కోవిడ్ డాక్టర్లు ఇచ్చిన మెకానిజం అనుసరించారా అనేది పరిశీలిస్తున్నాం

ఈ ప్రమాదం పరిశీలించడానికి జాయింట్ కలెక్టర్ చైర్మెన్‌గా కమిటీ

ఇప్పటి వరకూ పరిశీలనలు పూర్తయ్యాయి

రాష్ట్ర స్ధాయిలో మరో రెండు కమిటీలు 

రమేష్ హాస్పిటల్ వద్ద ఎలా అడ్మిట్ చేసుకుంటున్నారు అనేది పరిశీలన  pai  

రెండు రోజుల్లో పూర్తి నివేదిక కలెక్టర్ గారికి అందిస్తాం

2020-08-10 13:45 GMT

భూ రికార్డుల స్వచ్ఛీకరణకు షెడ్యూల్‌

అమరావతి: భూ రికార్డుల స్వచ్ఛీకరణకు షెడ్యూల్‌

- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీలకు సెప్టెంబరులోగా పరీక్షలు

- గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ కేంద్రాలు

- ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, వాటి మార్గదర్శకాలను డిజిటల్‌ బోర్డుల ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచనున్న ప్రభుత్వం

- అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో టాయిలెట్లు

- గ్రామ, వార్డు సచివాలయాలపై సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌

- ఇంకా మిగిలిపోయిన వార్డు సచివాలయాల నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశం

- అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్‌పైనా శ్రద్ధ చూపాలన్న సీఎం

2020-08-10 13:43 GMT

వాలంటీర్ల తొల‌గింపు

శ్రీకాకుళం జిల్లా: టెక్కలిలో వాలంటీరును విధుల నుంచి తొలగించిన అధికారులు..

పోలవరం గ్రామం వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న అశ్విని..

కోవిడ్ విధులలో నిర్లక్ష్యం కారణంగా తొలగింపుకు ఆదేశించిన జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు..

ఆశా కార్యకర్త సత్యవతి, సచివాలయ ఏ.ఎన్.ఎం రోహిణి లకు షోకాజ్ నోటీసులు జారీ..

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించిన జెసి శ్రీనివాసులు..

2020-08-10 13:38 GMT

సృష్టి యూనివర్సల్ పసిపిల్లల అక్ర‌మ‌ రవాణా కేసు

విశాఖ: సృష్టి యూనివర్సల్ పసిపిల్లల అక్ర‌మ‌ రవాణా కేసు

ముగిసిన డాక్టర్ నమ్రత పోలీస్ కస్టడీ

డాక్టర్ నమ్రత డాక్టర్ తిరుమల ను వైద్య పరీక్షలు నిమిత్తం కేజీహెచ్ కు తరలింపు

ఆనంతరం వర్చువల్ ద్వారా కోర్టు ముందు ప్రవేశ పెట్టనున్న పోలీసులు

డాక్టర్ తిరుమల నమ్రత నుండి కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

2020-08-10 13:36 GMT

సామర్లకోటలో విషాదం

తూర్పుగోదావరి: కరోన పాజిటివ్ తో హోమ్ క్వారంటైన్లో ఉన్న 45 సంవత్సరాల వ్యక్తి ఊపిరాడక మృతి..

మృతుడికి ఉదయం నుంచి ఊపిరి అందడం లేదని వైద్య సిబ్బందికి సమాచారం ఇచ్చిన బంధువులు..

పట్టించుకోని వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది.. మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చిన అంబులెన్స్.

మెడికల్ ఆఫీసర్ రాకుండా రోగిని తీసుకెళ్ళమని చెప్పిన అంబులెన్స్ సిబ్బంది..

రోగిని బయటకు తీసుకొచ్చేసరికే మృతి..

అంబులెన్స్, వైద్య సిబ్బందితో మృతుని కుటుంబ సభ్యుల వాగ్వివాదం..

Tags:    

Similar News