Asthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Asthma Women: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 136 మిలియన్ల మంది మహిళలు ఆస్తమాతో బాధపడుతున్నారు.

Update: 2022-05-18 12:30 GMT

Asthma Women: ఆస్తమా ఉన్న మహిళలు ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..!

Asthma Women: ప్రపంచవ్యాప్తంగా దాదాపు 136 మిలియన్ల మంది మహిళలు ఆస్తమాతో బాధపడుతున్నారు. UKలో గత ఐదేళ్లలో 5,100 కంటే ఎక్కువ మంది మహిళలు ఆస్తమా దాడితో మరణించారని నివేదికలు చెబుతున్నాయి. స్త్రీల హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉబ్బసం లక్షణాలు పెరగడానికి ప్రధాన కారణమని యూకేలో ఒక పరిశోధనలో తేలింది. శ్వాసనాళాలు ఇరుకుగా మారి శ్వాస తీసుకోవడం కష్టంగా మారే పరిస్థితిని ఆస్తమాగా అంటారు. ఇది గురక, ఊపిరి ఆడకపోవడం, ఛాతీలో బిగుతు, దగ్గు వంటి లక్షణాలతో ఉంటుంది.

బాల్యంలో అబ్బాయిలలో ఆస్తమా తీవ్రంగా ఉంటుంది. యుక్తవయస్సు తర్వాత పరిస్థితి తారుమారు అవుతుంది. కానీ మహిళల్లో బాల్యంలో ఆస్తమా తక్కువగా ఉంటుంది. కానీ యుక్తవయసు వచ్చిన తర్వాత తీవ్రంగా మారుతుంది. మహిళలు యుక్తవయస్సు, పీరియడ్స్, గర్భం, మెనోపాజ్ సమయంలో స్త్రీ హార్మోన్లు ఆస్తమాని తీవ్రతరం చేస్తాయి. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు పెరిగి ఒక్కోసారి మరణించే అవకాశాలు ఉంటాయి.

దీర్ఘ‌కాలిక వ్యాధి అయిన ఆస్త‌మా ఒక్క‌సారి వ‌చ్చిందంటే జీవిత కాలం వేధిస్తూనే ఉంటుంది. దీని వ‌ల్ల ఊప‌రి స‌రిగ్గా ఆడ‌క‌పోవ‌డం, కొంచెం దూరం న‌డిచినా లేదా ఏదైనా ప‌ని చేసినా ఆయాసం రావ‌డం, త‌ర‌చూ ఛాతి బిగుతుగా మార‌డం, గుర‌క, ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాలు తీవ్రంగా స‌త‌మ‌తం చేస్తుంటాయి. అందుకే ఆస్త‌మా ఉన్న వారు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అనేక ఆరోగ్య నియ‌మాల‌ను పాటించాలి.

Tags:    

Similar News