Women - Periods: మహిళలు పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు తీసుకోవాలి.. ఏంటంటే..?

Women - Periods: పీరియడ్స్‌ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. హార్మోన్స్‌ ప్రభావం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి.

Update: 2022-01-08 03:30 GMT

Women - Periods: మహిళలు పీరియడ్స్‌ సమయంలో ఈ ఆహారాలు తీసుకోవాలి.. ఏంటంటే..?

Women - Periods: పీరియడ్స్‌ సమయంలో మహిళలు జాగ్రత్తగా ఉండాలి. హార్మోన్స్‌ ప్రభావం వల్ల శరీరంలో చాలా మార్పులు జరుగుతాయి. ఒక్కోసారి కండరాలు పట్టేయడం, తలనొప్పి, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం, అలసట, చిరాకు, విచారం, కోపం, డిప్రెషన్ వంటి సమస్యలు మొదలవుతాయి. కాబట్టి పీరియడ్స్ సమయంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రుతుక్రమం సమయంలో మహిళలు పోషకాలు, ఆరోగ్యకరమైన వాటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏం తినాలి. ఏం తినకూడదో తెలుసుకుందాం.

పీరియడ్స్ సమయంలో మహిళల శరీరం నుంచి రక్తం పోతుంది. రక్తస్రావం ఎక్కువగా ఉన్నవారు తొందరగా అనారోగ్యానికి గురవుతారు. ఈ సమస్యను నివారించడానికి బచ్చలికూర, అరటిపండు, గుమ్మడికాయ, దుంప మొదలైన ఐరన్‌ అధికంగా ఉండే వాటిని తీసుకోవాలి. పీరియడ్స్ సమయంలో మహిళలు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కూడా తీసుకోవాలి. ఇందుకోసం పప్పులు, మిల్క్‌షేక్‌లు, పెరుగు, పాలు, నాన్ వెజ్, గుడ్డు, చేపలు, మొలకెత్తిన ధాన్యాలు మొదలైన వాటిని మీ ఆహారంలో చేర్చాలి.

నీరు మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. అందువల్ల ఈ సమయంలో శరీరంలో నీటి కొరత ఉండకూడదు. నీరు పుష్కలంగా తాగాలి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల మరింత మేలు జరుగుతుంది. పుదీనా టీ తాగడం వల్ల కడుపునొప్పి, తిమ్మిర్లు, వికారం, గ్యాస్ తదితర సమస్యలు తొలగిపోతాయి. పీరియడ్స్ సమయంలో ఈ సమస్య ఉన్న మహిళలకు పుదీనా టీ తాగడం చాలా మంచిది. శరీరంలో కాల్షియం కొరత ఉండకూడదు. లేదంటే కీళ్ల నొప్పుల సమస్యను ఎదుర్కొంటారు. కాల్షియం కోసం మీరు ఆహారంలో గింజలు, పాల ఉత్పత్తులు, సాల్మన్, చేపలు, టోఫు, బ్రోకలీ మొదలైన వాటిని తినాలి.

Tags:    

Similar News