Women Health Checkups: 45 ఏళ్లు దాటిన మహిళలు చేయించుకోవలసిన పరీక్షలు ఇవే..

Women Health Checkups: 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మోనోపాజ్ స్టేజ్. అంటే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్‌గా ఉండే వయసు. కాబట్టి రకరకాల ప్రమాదరకమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఈ వయసు నుంచే మొదలవుతుంది.

Update: 2025-07-11 13:35 GMT

Women Health Checkups: 45 ఏళ్లు దాటిన మహిళలు చేయించుకోవలసిన పరీక్షలు ఇవే..

Women Health Checkups: 45 ఏళ్లు దాటిన ప్రతి మహిళ కొన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే ఇది మోనోపాజ్ స్టేజ్. అంటే హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్‌గా ఉండే వయసు. కాబట్టి రకరకాల ప్రమాదరకమైన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఈ వయసు నుంచే మొదలవుతుంది. కాబట్టి 45 ఏళ్లు వచ్చిన ప్రతి మహిళ కొన్నిరకాల పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

45 ఏళ్లు వచ్చిన వారిలో లేదా 45ఏళ్లు దాటిన వారిలో కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చాలామందికి పీరియడ్స్ ఆగిపోతాయి. అయితే ఆగిపోయిన వారిలో ఒకరకమైన ఆరోగ్య సమస్యలు, ఆగని వారిలో మరొక రకమైన సమస్యలు తలెత్తుతాయి. దీన్నే మోనోపాజ్ స్టేజ్ అని పిలుస్తారు. ఈ స్టేజ్‌లోకి రాగానే మహిళలకు శరీరంపై వేడి ఆవిర్లు ఉండటం, రాత్రి పూట చెమటలు పట్టడం, నిద్రలేకపోవడం, మానసిక స్థితిలో మార్పులు రావడం, లైంగిక కోరికలు తగ్గిపోవడం, ప్రతిదానికీ చిరాకు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ప్రతి మహిళ మోనోపాజ్ స్టేజ్ దాటాల్సిందే. అయితే చాలాతక్కువమందిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. దాదాపు99 శాతం మందిలో మాత్రం ఇలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే ఇవి వచ్చినపుడే జాగ్రత్త పడాలని ఇప్పుడు డాక్టర్లు చెబుతున్నారు. ఏ మాత్రం అశ్రద్ద చేసినా ప్రమాదకర వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఎలాంటి పరీక్షలు చేయించుకోవాలి?

45 ఏళ్లలోకి అడుగుపెట్టిన ప్రతి మహిళ మూడు రకాల పరీక్షలను తప్పకుండా చేయించుకోవాలి. ఇందులో మొదటిది బ్లడ్ టెస్టులు, క్యాన్సర్ టెస్టులు, ఇక మూడోది ఎసెన్షియల్ స్కాన్ టెస్టులు చేయించుకోవాలి.

బ్లడ్ టెస్టులు

బ్లడ్ టెస్టుల విషయానికొస్తే ముఖ్యంగా మూడు రకాల బ్లడ్ టెస్టులు ప్రతి మహిళ చేయించుకోవాలి. అందులో మొదటిది సుగర్ టెస్టులు(HbA1c). ఈ టెస్ట్ చేయించుకోవడం వల్ల మీ శరీరంలో ఉన్న సుగర్ లెవెల్స్ ని కనిపెట్టవచ్చు. దీంతో వచ్చిన రిజల్ట్ బట్టి మందులు వాడటం వల్ల సుగర్ పెరిగే అవకాశం ఉండదు. రెండోది..థైరాయిడ్ టెస్ట్( TSH). ఇది మీ శరీరంలో థైరాయిడ్‌ ఉందో లేదో తెలియజేస్తుంది. దీనిబట్టి మందులు వాడాలి. ఇక మూడోది... లిపిడ్ ప్రొఫైల్ అంటే గుండెకు సంబంధించిన టెస్టులు. దీనిద్వారా ఈ వయసులో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను ముందే గుర్తించవచ్చు.

క్యాన్సర్ స్క్రీనింగ్స్

ఈ మధ్యకాలంలో మధ్య వయసులో మహిళలకు అకస్మాత్తుగా కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అయితే వీటి నుండి బయటపడాలంటే 45 ఏళ్లు వచ్చిన వెంటనే కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల క్యాన్సర్ల టెస్టులు చేయించుకోవాలి. అవి 1. బ్రెస్ట్ స్కాన్ 2. పెల్విక్ స్కాన్(uterus) 3. పాప్ స్మియర్ (cervix). ఈ మూడు రకాల క్యాన్సర్ల పరీక్షలు చేయించుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీనివల్ల ప్రమాదాలను ముందే అరికట్టవచ్చు.

ఎసెన్సియల్ స్కాన్

పై రెండు రకాల పరీక్షల చేయించుకున్న తర్వాత మూడో అత్యవసరమైన స్కాన్‌ని కూడా తప్పకుండా చేయించుకోవాలి. ఈ స్కాన్ పేరు డెక్సా స్కాన్. ఇది మీ ఎముక ఎంత బలంగా ఉంటుందో మీకు చెబుతుంది. ఎందుకంటే ఈ వయసు వచ్చిన మహిళలో ఎముకలు బలాన్ని తగ్గిపోతాయి. దీనివల్ల నీరసం, అలసట, నడవలేకపోవడం, ఎముకల్లో నొప్పులు, జాయింట్ పెయిన్స్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే వీటి నుండి ముందే బయటపడాలు అంటే ఈ డెక్సా స్కాన్ టెస్ట్ చేయించుకోవాలి.

ఈ టెస్టులు అన్నీ చేయించుకోవాలని డాక్టర్లే మీకు సలహా ఇస్తారు. అంతేకాదు రిపోర్టులు వచ్చిన తర్వాత డాక్టర్ల సలహా మేరకే మందులు వాడాలి. అయితే మీరు చేయించుకునే పరీక్షల్లో ఇవి ఉండేలా మీరు చూసుకోవడం మంచిది.

Tags:    

Similar News