Weird Tradition: ఇక్కడ మహిళలు జీవితంలో ఒక్కసారే స్నానం చేస్తారు.. ఆ తర్వాత నీటిని కూడా ముట్టుకోరు!

Update: 2025-03-09 06:00 GMT

Himba Women Bathing Tradition: ప్రపంచంలో ఎన్నో ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఆశ్చర్యకరమైనవి ఉంటాయి. అలాంటి ఒక సంప్రదాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడి మహిళలు జీవితంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేసి, జీవితాంతం నీటికి దూరంగా ఉంటారు. ఈ వింత ఆచారం ఎక్కడుందో తెలుసుకుందాం.

ఒక్కరోజు స్నానం చేయకుంటే మనకు ఏదోలా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఉదయం, సాయంత్రం రెండు పూటలా స్నానం చేస్తుంటారు. కానీ జీవితంలో ఒక్కసారి స్నానం చేసేవారి గురించి తలచుకుంటేనే షాకింగ్ అనిపిస్తుంది కదూ. అవును అక్కడి సంప్రదాయం ప్రకారం వారు జీవితంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. తర్వాత నీటిని అస్సలు ముట్టుకోరట. ఈ వింత సంప్రదాయం ఎక్కుడుందో తెలుసుకుందా.

ఉత్తర నమీబియాలో నివసించే హింబా తెగ, వారి పురాతన సంప్రదాయాలు, ప్రత్యేకమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందారు. హింబా తెగ మహిళలు తమ జీవితాంతం తమ పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారు. అయితే ఈ తెగ వారు నీటిని ఉపయోగించకుండా ఇతర సహజ పద్ధతుల ద్వారా తమ శరీరాన్ని శుభ్రంగా ఉంచుకుంటారు.

పరిశుభ్రత కోసం, వారు ప్రత్యేక మూలికలు కలిపిన నీటిని మరిగించి, బయటకు వచ్చే ఆవిరితో తనను తాను శుభ్రపరుచుకుంటారు.వారి చర్మంపై ఉన్న ఎర్రటి కాషాయ పూత వారి ప్రత్యేక అందం, సాంస్కృతిక గుర్తింపుకు చిహ్నంగా ఉంటాయి. ఈ పురాతన ఆచారాలు ఎడారి వాతావరణంలో నీటిని ఆదా చేయడానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి.

పొగతో స్నానం చేయడం వల్ల శరీరం నుండి క్రిములు తొలగిపోతాయని నమ్ముతుంటారు. తద్వారా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటాయని చెబుతున్నారు.వారి స్నాన సంప్రదాయం తరతరాలుగా వస్తుందని..తాము కూడా ఇదే ఆచారాన్ని పాటిస్తున్నామని చెబుతున్నారు. వారి మతపరమైన, సాంస్కృతిక విలువలను కాపాడుతుంది.ఈ ప్రత్యేకమైన సంప్రదాయాలు, సహజ మార్గాలకు ధన్యవాదాలు, హింబా మహిళలు ఆఫ్రికాలో అత్యంత అందమైనవారిగా పరిగణిస్తున్నారు. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్నారు.

Tags:    

Similar News