Winter Vibes : మగవారికంటే ఆడవారికే చలి ఎక్కువ..దీని వెనుక ఉన్న భయంకరమైన సైన్స్ ఇదే
Winter Vibes : చలికాలంలో కొందరు మఫ్లర్లు, స్వెటర్లు వేసుకున్నా వణుకుతుంటారు. మరికొందరు మాత్రం మామూలు షర్టుతోనే హాయిగా తిరుగుతుంటారు.
Winter Vibes : మగవారికంటే ఆడవారికే చలి ఎక్కువ..దీని వెనుక ఉన్న భయంకరమైన సైన్స్ ఇదే
Winter Vibes : చలికాలంలో కొందరు మఫ్లర్లు, స్వెటర్లు వేసుకున్నా వణుకుతుంటారు. మరికొందరు మాత్రం మామూలు షర్టుతోనే హాయిగా తిరుగుతుంటారు. ముఖ్యంగా ఒకే ఇంట్లో ఉన్న భార్యాభర్తల మధ్య ఏసీ టెంపరేచర్ విషయంలో గానీ, చలి విషయంలో గానీ ఎప్పుడూ చిన్నపాటి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. మగవారి కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుందని సైన్స్ చెబుతోంది. దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
శరీరంలో చలిని గ్రహించడం అనేది కేవలం వాతావరణం మీద మాత్రమే ఆధారపడి ఉండదు. మన బాడీలోని మెటబాలిజం అంటే జీవక్రియ రేటు దీనికి ప్రధాన కారణం. మగవారిలో కండరాల శాతం ఎక్కువగా ఉంటుంది. కండరాలు నిరంతరం పని చేస్తూ శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయి. అందుకే మగవారు ఒకరకం వాకింగ్ హీటర్లు లాగా ఉంటారు. మహిళల్లో కండరాల శాతం తక్కువగా ఉండి, కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో వేడి ఉత్పత్తి తక్కువగా ఉంటుంది. ఫలితంగా వారికి బయటి చలి తీవ్రంగా అనిపిస్తుంది.
మహిళల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ కూడా దీనికి ఒక కారణం. ఇది రక్త నాళాలను సున్నితంగా మారుస్తుంది. చలి పెరిగినప్పుడు మహిళల శరీరం వెంటనే స్పందించి, ముఖ్యమైన అవయవాలను (గుండె, ఊపిరితిత్తులు) వెచ్చగా ఉంచడం కోసం రక్త ప్రసరణను అటువైపు మళ్ళిస్తుంది. దీనివల్ల చేతులు, కాళ్లు, చెవులకు రక్త ప్రసరణ తగ్గి అవి త్వరగా చల్లబడిపోతాయి. అందుకే మహిళలకు చేతులు, పాదాలు ఐస్ ముక్కల్లా మారుతుంటాయి. పరిశోధనల ప్రకారం మహిళల శరీర అంతర్గత ఉష్ణోగ్రత మగవారి కంటే కొంచెం ఎక్కువగా ఉన్నా, వారి చేతులు మాత్రం మగవారి కంటే సుమారు 3 డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి.
రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నా, అంటే రక్తహీనత ఉన్నా చలి ఎక్కువగా అనిపిస్తుంది. సాధారణంగా మహిళల్లో హిమోగ్లోబిన్ స్థాయిలు మగవారి కంటే తక్కువగా ఉండటం వల్ల వారికి చలి త్వరగా తగులుతుంది. అలాగే వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో ఉష్ణోగ్రతను నియంత్రించే శక్తి తగ్గుతుంది. అందుకే వృద్ధులకు చలి గాలి తగిలినా వణుకు పుడుతుంది. సరిగ్గా నీళ్లు తాగకపోవడం, ఎక్కువగా కాఫీ/టీలు తీసుకోవడం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత నియంత్రణ దెబ్బతింటుంది. అందుకే చలికాలంలో మహిళలు పోషకాహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం చాలా ముఖ్యం.