Monsoon Health: వానాకాలంలో కడుపు ఎందుకు పాడవుతుంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ?

Monsoon Health: వర్షాకాలం వచ్చిందంటే చాలామందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది.

Update: 2025-06-26 10:10 GMT

Monsoon Health: వానాకాలంలో కడుపు ఎందుకు పాడవుతుంది.. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి ?

Monsoon Health: వర్షాకాలం వచ్చిందంటే చాలామందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తుంది. ముఖ్యంగా కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటివి ఈ కాలంలో చాలా కామన్. ఎందుకంటే, వర్షంలో వాతావరణం అంతా తేమగా, మురికిగా ఉంటుంది. దీనివల్ల తినే వస్తువులు త్వరగా పాడైపోతాయి. బయట పెట్టిన ఆహారంలో ఈ సీజన్‌లో బాక్టీరియా త్వరగా పెరుగుతుంది. అవి ఆహారాన్ని పాడు చేస్తాయి. అయితే ఈ కాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

ముఖ్యంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. శుభ్రమైన, మరిగించిన నీటిని మాత్రమే తాగాలి. శరీరంలో ఉప్పు, చక్కెర లోపం లేకుండా చూసుకోవాలి. ఈ అలవాట్లు పాటిస్తే వర్షాకాలంలో కూడా మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. ఈ వర్షాకాలంలో ప్రతి ఆహార పదార్థాన్ని బాగా కడిగి, పూర్తిగా వండిన తర్వాతే తినాలి. అన్నం తినే ముందు, టాయిలెట్‌కు వెళ్లిన తర్వాత చేతులు బాగా కడిగే అలవాటును తప్పకుండా పాటించండి. ఒకవేళ కడుపు సమస్యలు వస్తే, ఓఆర్‌ఎస్ (ORS), ఎక్కువ నీళ్లు, తగినంత విశ్రాంతి, సరైన ఆహారం తీసుకోవాలి. రెండు రోజుల కంటే ఎక్కువ విరేచనాలు, వాంతులు, లేదా జ్వరం ఉంటే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

వర్షాకాలంలో ఎక్కువగా గ్యాస్, ఎసిడిటీ, డయేరియా, ఫుడ్ పాయిజనింగ్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. దీనికి కారణం గాలిలో తేమ ఎక్కువగా ఉండటం, బాక్టీరియా పెరగడం, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయడం. అలాంటి సమయంలో కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి తేలికపాటి, శుభ్రమైన, త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

ఈ వర్షాకాలంలో జీర్ణ శక్తిని దృష్టిలో పెట్టుకుని తేలికపాటి, శుభ్రమైన ఆహారం తీసుకోవాలి. మరిగించిన నీరు, తేలికపాటి ఆహారం తీసుకోవాలి. పెసరపప్పు, కిచిడీ తినాలి. ఒక వేళ ఎసిడిటీ సమస్య లేకపోతే పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవడానికి నిమ్మకాయ నీళ్లు లేదా కొబ్బరి నీళ్లు తాగాలి. సూప్‌లు, ఉడకబెట్టిన కూరగాయలు, పసుపు, వాము, జీలకర్ర వంటి సుగంధ ద్రవ్యాలను వంటల్లో వాడాలి.

వర్షాకాలంలో గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం మురికి నీటిని తాగకుండా చూసుకోవడం. వర్షం పడినప్పుడు నీటి వనరుల్లో మురికి చేరిపోతుంది. అలాగే, వాతావరణం మారినప్పుడు శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. బలహీనమైన ఇమ్యూనిటీ ఉన్నప్పుడు వర్షాకాలంలో ఆహారం జీర్ణం చేసుకోవడం కష్టం. కాబట్టి, పాత లేదా నూనెలో వేయించిన ఆహారాన్ని ఎంత వీలైతే అంత దూరం ఉండాలి.

Tags:    

Similar News