Cholesterol: బాడీలో కొలస్ట్రాల్‌ పెరిగితే ఏమి తినాలి.. ఏమి తినకూడదు..!

Cholesterol: బాడీలో కొలస్ట్రాల్‌ పెరిగితే ఏమి తినాలి.. ఏమి తినకూడదు..!

Update: 2022-06-15 08:30 GMT

Cholesterol: బాడీలో కొలస్ట్రాల్‌ పెరిగితే ఏమి తినాలి.. ఏమి తినకూడదు..!

Cholesterol: కొలెస్ట్రాల్ అనేది ఒక జిగట పదార్థం. ఇది హార్మోన్లను నిర్మించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ప్రోటీన్లతో కలిసి లిపోప్రొటీన్లను ఏర్పరుస్తుంది. మన శరీరంలో 2 రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. వీటిని మంచి, చెడు కొలస్ట్రాల్‌ అంటారు. దీనిని వరుసగా HDL,LDLకొలస్ట్రాల్‌ అని పిలుస్తారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే రక్త ప్రసరణలో అడ్డంకులు ఏర్పడతాయి. దీని కారణంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. శరీరంలో LDL పెరగకుండా ఎలా ఆపాలో తెలుసుకుందాం.

వీటిని తినడం ద్వారా కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంటుంది

1. గ్రీన్ టీ

గ్రీన్‌ టీలో యాంటీఆక్సిడెంట్లు, అనేక రకాల ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. దీనిని బరువు తగ్గించే పానీయంగా ఉపయోగిస్తారు. మీరు రోజూ గ్రీన్ టీ తాగితే కొలెస్ట్రాల్ గణనీయంగా తగ్గుతుంది.

2. ఫ్లాక్స్ సీడ్

అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని చెప్పవచ్చు. ఈ విత్తనాల సాయంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించవచ్చు. దీన్ని సలాడ్‌లు, ఓట్స్‌లో కలుపుకుని తినవచ్చు.

3. చేప

చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు సమృద్ధిగా లభిస్తాయి. ఇది రక్తంలో ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వీటిని నివారించండి

1. ఆయిల్ ఫుడ్స్

భారతదేశంలో వండే ఆహారం ఎక్కువ భాగం నూనెతో కూడుకున్నవి. మార్కెట్‌లో లభించే జంక్ ఫుడ్ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.

2. పాల ఉత్పత్తులు

పాలను సంపూర్ణ ఆహారం అంటారు. ఎందుకంటే ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కానీ అధిక కొవ్వు పాలు, చీజ్‌కు దూరంగా ఉండటం మంచిది.

3. మాంసం

మాంసం తినడం ద్వారా శరీరానికి ప్రోటీన్ లభిస్తుందనడంలో సందేహం లేదు. కానీ దాని వినియోగం కొలెస్ట్రాల్ స్థాయిని గణనీయంగా పెంచుతుంది. తరువాత గుండెపోటుకు కారణం అవుతుంది.

Tags:    

Similar News