Yoga: యోగా చేసేముందు తర్వాత ఎలాంటి ఆహారం తింటే మంచిదంటే..?

Yoga: యోగా చేసేముందు తర్వాత ఎలాంటి ఆహారం తింటే మంచిదంటే..?

Update: 2022-02-11 12:30 GMT

Yoga: యోగా చేసేముందు తర్వాత ఎలాంటి ఆహారం తింటే మంచిదంటే..?

Yoga: ఆధునిక కాలంలో చాలామంది బిజీ షెడ్యూల్‌, పని ఒత్తిడి వల్ల మానసికంగా ఇబ్బందిపడుతున్నారు. అనారోగ్యాలకి గురై ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ సంపాదించిన డబ్బులు మొత్తం ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి వారు యోగా గురించి కచ్చితంగా యోగా గురించి తెలుసుకోవాలి. ఉదయం లేదా సాయంత్రం కొంత సమయం యోగాకి కేటాయించితే మీ శరీరం, మనసు మీ అదుపులో ఉంటుంది. ఒత్తిడి, టెన్షన్ నుంచి రిలాక్స్‌ కావొచ్చు. అయితే యోగా చేసేముందు, చేసిన తర్వాత ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

యోగా చేస్తున్న సమయంలో మన శరీరం అధిక మొత్తంలో క్యాలరీలను కోల్పోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే మనం తగినన్ని కార్బోహైడ్రేట్లను ఆహార రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆరోగ్యకరమైన శాఖాహార లేదా మాంసాహారంతో తయారు చేసిన సూప్ తీసుకోవడం వల్ల మన  శరీరానికి కావలసినన్ని కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. అదేవిధంగా సూప్ తో పాటు సలాడ్ తీసుకోవచ్చు. వివిధ రకాల పండ్లు, గింజలను ఉపయోగించి సలాడ్ తయారు చేసుకునీ తాగవచ్చు. యోగా తర్వాత మన శరీరానికి అధిక కేలరీలు అవసరం అవుతాయి.

ఈ క్రమంలోనే అధిక కేలరీలు కలిగిన పన్నీర్ తీసుకోవడం ఉత్తమం. ఒక వ్యక్తి నీరసించి పోయినప్పుడు వెంటనే శక్తి పొందడానికి కొబ్బరి నీళ్లు తాగించడం పూర్వకాలం నుంచి వస్తుంది. కొబ్బరి నీళ్లలో అధిక మొత్తంలో పోషకాలు ఉండటం వల్ల తొందరగా మన శరీరానికి శక్తి అందుతుంది. యోగాలో మీ శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉండాలి. ఎందుకంటే వ్యాయామం చేసే సమయంలో చెమటలు పట్టడం వల్ల డీహైడ్రేషన్ సమస్య ఉంటుంది. శరీరానికి తగినంత నీరు అవసరం. యోగా చేసిన 30 నుంచి 40 నిమిషాల తర్వాత ముందుగా నీళ్లు తాగాలి. తరువాత ధాన్యాలు ఉపయోగించిన ఆహారాన్ని తీసుకోవాలి. కావాలంటే పాలు, తృణధాన్యాలు తీసుకోవచ్చు.

Tags:    

Similar News