Most Expensive Pickle: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పికిల్.. ఈ ఊరగాయ ధరతో బంగారం కొనొచ్చు..!!
Most Expensive Pickle: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పికిల్.. ఈ ఊరగాయ ధరతో బంగారం కొనొచ్చు..!!
Most Expensive Pickle: మన భోజనానికి అసలైన రుచి తీసుకొచ్చేది ఊరగాయ. ఒక చిన్న ముక్క చాలు అన్నానికి ప్రాణం పోసేందుకు. కానీ ఇదే ఊరగాయ లగ్జరీ ఫుడ్‌గా మారుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? సాధారణంగా మన ఇళ్లలో ఊరగాయలు చవకగా, ఇంట్లోనే తయారయ్యేవిగా భావిస్తాం. కానీ ప్రపంచంలో కొన్ని ఊరగాయలు మాత్రం వాటి ధర, తయారీ విధానం వింటేనే నోరు వెళ్లబెట్టేలా చేస్తాయి.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఊరగాయను ప్రత్యేకంగా ఒక అమెరికన్ టీవీ షో కోసం తయారు చేశారు. “మోస్ట్ ఎక్స్‌పెన్సివిస్ట్” అనే ప్రఖ్యాత షోలో ధనవంతులు ఎక్కువగా డబ్బు ఖర్చు చేసే అరుదైన వస్తువులను పరిచయం చేస్తారు. అదే షో కోసం “ది రియల్ దిల్” అనే ప్రీమియం బ్రాండ్ ఓ అసాధారణమైన ఊరగాయను రూపొందించింది. దీనికి వారు పెట్టిన పేరు “24 క్యారెట్స్”. ఈ పేరు 24 క్యారెట్ బంగారాన్ని సూచించేలా ఉంటుంది.
ఈ ఊరగాయలో సాధారణంగా ఉపయోగించే దోసకాయ లేదా మామిడి ఉండదు. బదులుగా క్యారెట్‌లను ఉపయోగించారు. కానీ అవి కూడా సాధారణ ముక్కలుగా కాదు. విలువైన రత్నాల ఆకారంలో చేతితో చెక్కి తయారు చేశారు. ప్రతి ముక్క తయారీకి చాలా సమయం, నైపుణ్యం అవసరం. అందుకే ఇది ఒక ఫుడ్ ఐటెమ్ కంటే ఆర్ట్ పీస్‌లా కనిపిస్తుంది.
ఈ ఊరగాయలో ఉపయోగించిన పదార్థాలే దీన్ని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా మార్చాయి. షాంపైన్ వెనిగర్, ఇటలీలోని మోడెనా ప్రాంతం నుంచి తీసుకొచ్చిన వైట్ బాల్సమిక్ వెనిగర్, స్పెయిన్‌కు చెందిన వెనిగర్ డి జెరెజ్ వంటి అరుదైన వెనిగర్‌లు ఇందులో ఉన్నాయి. ఉప్పుగా ఒరెగాన్ సముద్ర ఉప్పు, సుగంధ ద్రవ్యాలుగా ఇరాన్ కుంకుమపువ్వు, ఫెన్నెల్ పుప్పొడి, ఫ్రాన్స్ మిరపకాయ, మెక్సికో వెనిల్లా బీన్స్ వాడారు. అందుకే ఈ ఊరగాయ రుచిలోనే కాదు, నాణ్యతలో కూడా ప్రత్యేకంగా నిలిచింది.
ఇది కేవలం షోలో ప్రదర్శన కోసం మాత్రమే తయారైంది. మార్కెట్లో అమ్మకానికి ఎప్పుడూ రాలేదు. అంటే డబ్బు ఉన్నా కూడా సాధారణ ప్రజలకు ఇది దొరకదు.
ఇక భారత్ విషయానికి వస్తే, ఇక్కడ ఊరగాయలు మన జీవనశైలిలో భాగమే. ప్రతి రాష్ట్రంలో ప్రత్యేకమైన ఊరగాయలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా కొన్ని ఊరగాయలు అరుదైన పదార్థాల వల్ల ఖరీదైనవిగా మారాయి. బీహార్‌లో గండక్ నదిలో దొరికే ప్రత్యేకమైన చేపతో తయారుచేసే ఊరగాయ ఎంతో ప్రసిద్ధి. ఈ చేప అరుదుగా దొరకడం వల్ల, దానితో చేసే ఊరగాయ కిలో ధర వెయ్యి రూపాయల వరకు ఉంటుంది. సాధారణంగా మనం చవకగా భావించే ఊరగాయ కూడా, సరైన పదార్థాలు మరియు ప్రత్యేకత ఉంటే లగ్జరీ స్థాయికి చేరుతుందని ఇది చూపిస్తోంది.