Guava: జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామపండు తినొచ్చా.. ఏం జరుగుతుంది..?

Guava: చలికాలంలో జామపండ్లు అధికంగా లభిస్తాయి. ఎందుకంటే ఇది ఈ సీజన్ ఫ్రూట్...

Update: 2022-03-02 11:30 GMT

Guava: జలుబు, దగ్గు ఉన్నప్పుడు జామపండు తినొచ్చా.. ఏం జరుగుతుంది..?

Guava: చలికాలంలో జామపండ్లు అధికంగా లభిస్తాయి. ఎందుకంటే ఇది ఈ సీజన్ ఫ్రూట్. సాధారణంగా జామకాయని పేదోడి యాపిల్ అంటారు. ఎందుకంటే తక్కువ ధరలో యాపిల్లో ఉండే పోషకాలని అందిస్తుంది కాబట్టి. జామకాయలో పోషకాలు సమృద్దిగా ఉంటాయి. విటమిన్ సి, ఎ, ఈ, ఫైబర్, ఐరన్, క్యాల్షియం, మాంగనీస్ వివిధ రకాల ఖనిజాలు ఉంటాయి. జామకాయ రోజు తింటే రోగనిరోధక శక్తి బలంగా ఉంటుంది. కానీ చాలామందికి దగ్గు, జలుబు సమయంలో జామకాయ తినవచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.

జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు జామకాయని తినవచ్చు కానీ బాగా పండిన జామకాయ తినకూడదు. ఎందుకంటే ఇది శ్లేష్మాన్ని పెంచుతుంది. కఫాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ సమయంలో కొంచెం కచ్చగా ఉండే జామకాయలు తింటే మంచిది. పండు జామకాయలకి దూరంగా ఉండాలి. వీలైతే ఈ జామకాయలని కూడా కొద్దిగా వేడి చేసి తీసుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జామకాయలే కాకుండా జామ ఆకులు కూడా ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి. చాలా రోగాలకు మంచి మందుగా పనిచేస్తాయి.

డయాబెటిక్ పేషెంట్లు కూడా జామ తినాలా వద్దా అనే సందేహం ఉంటుంది. కానీ చాలా మంది నిపుణులు ఈ రోగులు రోజుకు ఒక జామపండు తినమని సలహా ఇస్తారు. మధుమేహాన్ని నియంత్రించడంలో జామపండు చక్కగా పనిచేస్తుంది. మీ కడుపు శుభ్రంగా లేకుంటే ఖచ్చితంగా జామపండు తినాలి. జామలో డైటరీ ఫైబర్ ఉంటుంది ఇది మీ పొట్టను శుభ్రం చేస్తుంది. కానీ రాత్రిపూట మాత్రం తినవద్దు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా జామను తినాలి.

ఇందులో ఎక్కువ కేలరీలు ఉండవు. డైటరీ ఫైబర్ కారణంగా ఇది ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఈ పరిస్థితిలో మీరు ఆహారం తీసుకోరు. దీంతో బరువు తగ్గే అవకాశాలు మెండుగా ఉంటాయి. క్యాన్సర్‌ని నివారించడంలో జామ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి.

Tags:    

Similar News