Cholesterol: కొలెస్ట్రాల్ 240 mg/dl కంటే ఎక్కువ ఉంటే.. ఏం జరుగుతుంది?

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అన్నీ అనర్దాలే అన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ అసలు శరీరంలో ఎంతవరకు కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కొలెస్ట్రాల్ 240 mg/dl కంటే ఎక్కువ ఉంటే.. ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2025-07-01 17:00 GMT

Cholesterol: కొలెస్ట్రాల్ 240 mg/dl కంటే ఎక్కువ ఉంటే.. ఏం జరుగుతుంది?

Cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ ఉంటే అన్నీ అనర్దాలే అన్న సంగతి చాలామందికి తెలుసు. కానీ అసలు శరీరంలో ఎంతవరకు కొలెస్ట్రాల్ ఉండొచ్చు. కొలెస్ట్రాల్ 240 mg/dl కంటే ఎక్కువ ఉంటే.. ఏం జరుగుతుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ శరీరంలో ఒక మైనపు లాంటి పదార్ధం. ఇది శరీరంలో ప్రతి కణంలో ఉంటుంది. ఇంకా స్పస్టంగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ అనేది మీ రక్తంలో కరిగే కొవ్వులాంటి పదార్ధం. కొవ్వు అనేది శరీరానికి చాలా అవసరం. కానీ ఎంత ఉండాలో అంత ఉండకుండా అధికంగా ఉంటే చాలా ప్రమాదం.

కొవ్వు వల్ల ఉపయోగాలేంటి?

శరీరంలో కొవ్వు అనేది చాలా అవసరం. హార్మోన్ల ఉత్పత్తికి, విటమిన్ డి తయారీకి , ఆహారం జీర్ణం అవ్వడానికి కొలెస్ట్రాల్ అందరికీ అవసరం. కాలేయం శరీరానికి అవసరమైన కొవ్వును తయారుచేస్తుంది. అంతేకాదు, తినే ఆహారపదార్ధాల వల్ల కూడా కొవ్వు వస్తుంది. అయితే ఇది ఎక్కువ అయితేనే ఎక్కువ ప్రమాదం.

శరీరంలో ఎంత కొవ్వు ఉండాలి?

శరీరంలో కొవ్వు ఎంత ఉండాలి అనేది మనిషిని బట్టి ఉంటుంది. ఆడవాళ్లకు ఒకలా, మగవాళ్లకు ఒకలా ఉంటుంది. అదేవిధంగా వయసు, ఫిట్నెస్‌, ఆరోగ్య పరిస్థితులను బట్టి కూడా కొవ్వు ఎంత అవసరమో తెలుస్తుంది. అంతేకాదు సాధారణంగా 200 mg/dl కంటే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను సాధరణమైనవని పరిగణిస్తారు. 200 నుండి 239 mg/dl మధ్య ఉంటే బార్డర్ లైన్ లో ఉందని చెబుతారు. అందుకే 200 mg/dl కంటే తక్కువ కొలెస్ట్రాల్ స్థాయిలను మెయింటైన్ చేయాలి. ఒకవేళ బోర్డర్‌‌లైన్‌కు వస్తుందని తెలియగానే ఆహారపు అలవాట్లలో మార్పులు చేయాలి. వ్యాయామాలు మరింత ఎక్కువగా చేయడం మొదలుపెట్టాలి. అంతేకాదు ప్రతిరోజూ 40 నిమిషాలకు తక్కువ కాకుండా వాకింగ్ చేయాలి. బయట దొరికే ఆహారం తినకుండా ఇంట్లో చేసే పదార్ధాలను మాత్రమే తినాలి. అప్పుడు శరీరంలో అధికంగా కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉండదు.

240 mg/dl కంటే ఎక్కువ ఉంటే.. ఏం జరుగుతుంది?

240 mg/dl లేదా 240 mg/dl కంటే ఎక్కువ కొలెస్ట్రాల్ ఉంటే వీటిని హై కొలెస్ట్రాల్‌ గా గుర్తిస్తారు. ఒక్కసారి శరీరంలోకి అధికంగా కొలెస్ట్రాల్ వచ్చిందంటే దాన్ని తగ్గించడం చాలా కష్టంగా ఉంటుంది. అయితే అనుకుంటే సాధించగలరు. దీనికి సంబంధించి ఆహారపు అలవాట్లను పూర్తిగా మార్చాలి. వ్యాయామం ఎక్కువగా చేయాలి. అయితే ఒకేసారి కాకుండా నెమ్మది నెమ్మదిగా శరీరానికి అలవాటు చేయాలి. ఎందుకంటే శరీరంలో అధిక కొవ్వు ఉంటే హార్ట్ఎటాక్స్ వస్తాయి. అలాగే బీపీ, షుగర్ లు ఎక్కువ అవుతాయి. ఇక రకరకాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది.

మీరు అధికమైన కొలెస్ట్రాల్ స్థాయిలను కలిగి ఉంటే వెంటనే డాక్టర్‌‌ని సంప్రదించాలి. డాక్టర్ సలహా మేరకు ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు చేయడం మంచిది. సొంతవైద్యం ఎపుడూ మంచిది కాదు. కాబట్టి అధికంగా కొవ్వు ఉంది అని అనిపిస్తే వెంటనే డాక్టర్‌‌ని కలవాలి.

Tags:    

Similar News