Wellness Tourism: ఆరోగ్య యాత్రలు.. టూర్‌కి వెళ్లి 'హెల్దీ'గా తిరిగి రండి.. వెల్‌నెస్ టూరిజం అంటే ఏంటో తెలుసా?
Wellness Tourism: టూర్ అంటే కేవలం ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు.. ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుచుకోవడం. భారతదేశంలో వెల్‌నెస్ టూరిజం (Wellness Tourism) క్రేజ్ పెరుగుతోంది. కేరళ ఆయుర్వేదం నుంచి రిషికేశ్ యోగా వరకు, మీరు ఫిట్‌గా మారేందుకు వెళ్లాల్సిన టాప్ ప్లేసెస్ ఇవే!
Wellness Tourism: ఆరోగ్య యాత్రలు.. టూర్‌కి వెళ్లి 'హెల్దీ'గా తిరిగి రండి.. వెల్‌నెస్ టూరిజం అంటే ఏంటో తెలుసా?
Wellness Tourism: సాధారణంగా మనం విహారయాత్రలకు వెళ్లేది సరదాగా గడపడానికి, కొత్త ప్రదేశాలను చూడటానికి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కేవలం వినోదం కోసమే కాకుండా, శారీరక, మానసిక ఆరోగ్యం కోసం చేసే ప్రయాణాలు పెరుగుతున్నాయి. దీనినే ‘వెల్‌నెస్ టూరిజం’ (Wellness Tourism) లేదా 'ఆరోగ్య యాత్రలు' అని పిలుస్తున్నారు.
భారతదేశం ప్రస్తుతం ప్రపంచంలోనే వెల్‌నెస్ టూరిజానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. మన దేశంలోని యోగా, ఆయుర్వేదం, నేచురోపతి చికిత్సలు ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మరి మీరు కూడా ఒత్తిడిని వీడి, కొత్త ఉత్సాహాన్ని పొందాలనుకుంటే సందర్శించాల్సిన 6 అద్భుతమైన ప్రాంతాలు ఇవే:
1. కేరళ: ఆయుర్వేద నిలయం
కేరళ అంటేనే ప్రకృతి సిద్ధమైన వైద్యానికి చిరునామా. కొట్టాయం, కోవళం, వార్కల వంటి ప్రాంతాల్లోని ఆయుర్వేదశాలలు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడి సోమతీరం వెల్‌నెస్ సెంటర్ పర్యాటకులకు అత్యంత ఇష్టమైన ప్రాంతం.
2. ఉత్తరాఖండ్: హిమాలయాల ఒడిలో ధ్యానం
మంచు కొండలు, పవిత్ర నదుల మధ్య మానసిక ప్రశాంతత కోరుకునే వారికి ఉత్తరాఖండ్ స్వర్గధామం. రిషికేశ్‌లోని ‘ఆనంద రిసార్ట్’ ఇండియాలోనే అత్యంత ఫేమస్. వంద ఎకరాల్లో అడవి మధ్యలో ఉండే ఈ రిసార్ట్‌లో రకరకాల మెడిటేషన్ థెరపీలు అందుబాటులో ఉన్నాయి.
3. కరుణ ధామ్ (తమిళనాడు): ప్రకృతితో మమేకం
కొడైకెనాల్‌లోని దట్టమైన అడవి మధ్యలో ఉండే కరుణ ధామ్ విభిన్నమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ కేవలం యోగా మాత్రమే కాకుండా, సేంద్రియ వ్యవసాయం, తోట పనులు వంటివి చేస్తూ ప్రకృతితో మమేకం అవ్వొచ్చు.
4. పుణె (మహారాష్ట్ర): సంప్రదాయం + వెస్టర్న్ థెరపీ
పుణెలోని ‘ఆత్మంతన్’ కేంద్రం ఆయుర్వేదంతో పాటు వెస్టర్న్ ట్రీట్‌మెంట్స్ అయిన హమామ్ బాత్, హైడ్రోథెరపీ వంటివి అందిస్తోంది. బాడీ పాలిష్, ఆక్యుప్రెషర్ వంటి చికిత్సలు ఇక్కడ హైలైట్.
5. గోకర్ణ (కర్ణాటక): సాంప్రదాయ జీవనశైలి
గోకర్ణలో విదేశీ పర్యాటకులు స్థానికుల ఇంట్లో విడిది చేస్తూ మన సంస్కృతిని నేర్చుకుంటారు. మెడిటేషన్, ప్రాణాయామం చేస్తూ సాత్విక జీవనాన్ని అనుభవించాలనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్.
6. మెహ్‌సానా (గుజరాత్): నేచురల్ క్యూర్ సెంటర్
గుజరాత్‌లోని మెహ్‌సానా ఇప్పుడు వెల్‌నెస్ హబ్‌గా మారింది. ఇక్కడి ‘నింబా నేచర్ క్యూర్ సెంటర్’ ఒబెసిటీ, ఒత్తిడి తగ్గించడానికి అయాన్ డీటాక్స్, మడ్ బాత్ వంటి వినూత్న థెరపీలను అందిస్తోంది.