Health Supplements : హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.. మీకు మూడినట్లే.. వాడే ముందు ఇది తెలుసుకోండి
ఫిట్‌గా కనిపించాలని కోరుకోవడం ఈ రోజుల్లో కామన్. ముఖ్యంగా యువత ఇందుకోసం జిమ్‌లలో కసరత్తులు చేయడంతో పాటు, రకరకాల హెల్త్ సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు. అయితే, వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Health Supplements : హెల్త్ సప్లిమెంట్స్ వాడుతున్నారా.. మీకు మూడినట్లే.. వాడే ముందు ఇది తెలుసుకోండి
Health Supplements : ఫిట్‌గా కనిపించాలని కోరుకోవడం ఈ రోజుల్లో కామన్. ముఖ్యంగా యువత ఇందుకోసం జిమ్‌లలో కసరత్తులు చేయడంతో పాటు, రకరకాల హెల్త్ సప్లిమెంట్స్ కూడా వాడుతున్నారు. అయితే, వాటి వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జిమ్‌కి వెళ్లి హెల్త్ సప్లిమెంట్స్ తీసుకునేవారు ఇప్పుడు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఈ సప్లిమెంట్స్ ఎలా మన ఎముకలను బలహీనపరుస్తాయో, ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయో ఈ వార్తలో తెలుసుకోండి.
ఈ విషయంపై ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని ఆర్థోపెడిక్స్ విభాగంలో 50కి పైగా కేసులు నమోదయ్యాయి. 15 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువకులు తీవ్రమైన ఎముకలు, వెన్నుపూస సమస్యలతో బాధపడుతున్నారు. వీరి ఎముకల పరిస్థితిని చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఈ యువకుల వెన్నుపూస 30 నుంచి 40 ఏళ్ల వ్యక్తి వెన్నుపూసలా బలహీనంగా మారిందని వారు చెబుతున్నారు.
సాధారణంగా, 13-14 ఏళ్ల నుంచే యువకులు జిమ్‌లలో చేరి, ఇంటర్నెట్ చూసి ప్రోటీన్ పౌడర్‌లు, స్టెరాయిడ్స్ వంటి సప్లిమెంట్స్ తీసుకోవడం మొదలుపెడతారు. ప్రారంభంలో ఇవి వేగంగా మార్పులు చూపించినప్పటికీ, లోపల మాత్రం ఎముకలను గుల్లగా మారుస్తాయి. ఈ అలవాటు క్రమంగా ఎముకల బలహీనతకు, డిస్క్ డ్యామేజ్‌కు దారితీసి చివరికి మల్టీ-డిస్క్ ఫెయిల్యూర్ వంటి తీవ్ర సమస్యలకు కారణమవుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
15 నుంచి 20 సంవత్సరాల వయస్సు గల చాలా మంది యువకులకు వెన్నుపూస శస్త్రచికిత్స అవసరం అవుతోంది. వారి శరీరాలు చాలా బలహీనంగా మారడం వల్ల రోజువారీ పనులు చేసుకోవడం కూడా వారికి కష్టంగా మారింది. స్టెరాయిడ్స్ లేదా పేరు తెలియని సప్లిమెంట్లను నిరంతరం వాడటం వల్ల ఎముకల్లో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఈ సప్లిమెంట్స్ ఎముకలకు మాత్రమే కాకుండా, కిడ్నీలు, కాలేయం వంటి ఇతర ముఖ్య అవయవాలకు కూడా తీవ్ర నష్టం కలిగిస్తాయి. కొన్నిసార్లు, ఇవి మల్టీ-ఆర్గన్ ఫెయిల్యూర్కు కూడా కారణం కావచ్చు. దీని వల్ల ఎముకలు తేలికగా విరిగిపోయే ప్రమాదం పెరుగుతుంది. వెన్నునొప్పి, పెరిగిన యూరిక్ యాసిడ్, డిస్క్ బలహీనపడటం, విటమిన్ డి లోపం వంటి సమస్యలు కూడా వస్తాయి అని డాక్టర్లు చెబుతున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి సప్లిమెంట్లను తీసుకోవద్దు. ప్రోటీన్ లేదా పోషకాల లోపం ఉంటే, సమతుల్య ఆహారం, వ్యాయామం ద్వారా దాన్ని సరి చేసుకోవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఏం తింటున్నారు, ఎంత తింటున్నారు అనే దానిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. నిజమైన శారీరక శక్తి అనేది ఏ విధమైన పౌడర్ల లేదా రసాయనాల నుండి రాదు, అది శరీరంలో సహజంగా ఉత్పత్తి అవుతుంది అని తెలుసుకోవాలి.