Viral Video: ప్రింటర్.. చపాతీలు తయారు చేసే మిషన్ అయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: ఈ మధ్యకాలంలో ఎందుకు వీడియోలు వైరల్ అవుతున్నాయో ఎవరకీ తెలియదు. ఆ వీడియోలో కాస్త వింత, కాస్త ఇంట్రెస్టింగ్, కాస్త థ్లిల్లింగ్ ఉంటే చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి.
Viral Video: ప్రింటర్.. చపాతీలు తయారు చేసే మిషన్ అయిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో
Viral Video: ఈ మధ్యకాలంలో ఎందుకు వీడియోలు వైరల్ అవుతున్నాయో ఎవరకీ తెలియదు. ఆ వీడియోలో కాస్త వింత, కాస్త ఇంట్రెస్టింగ్, కాస్త థ్లిల్లింగ్ ఉంటే చాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇదిగో ఈ వీడియోని చూడండి. ఒక మహిళ తన ఇంట్లో ఉన్న ప్రిటర్లో చపాతీ పిండి పెట్టి చపాతీలు చేసింది. అసలు ఆమె ఇంకా ఏం చేసిందో చూద్దాం పదండి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు వైరల్‌గా మారుతున్నాయి. ఇవి ఆసక్తిగా ఉండటమే కారణం. అయితే తాజాగా ఇలాంటి వీడియో ఒక సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఒక మహిళ ప్రింటర్‌తో రోటీలు చేస్తున్నట్టు క్రియేటివ్‌గా రూపొందించిన వీడియో చాలా మందికి నవ్వును తెప్పిస్తోంది. ఈ ఫన్నీ వీడియోను ఇప్పటివరకు లక్షలమంది చూడడం విశేషం.
@palsskit అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఉన్న ఈ వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఒక మహిళ తన బ్రెయిన్‌ను అద్బుతంగా ఉపయోగించి రోటీలు చేసింది. ముందు చపాతి పిండిని కలిపిన తర్వాత దాన్ని నిలువ ముద్దలా చేసి ప్రింటర్ లోపలికి వెళ్లేలా పెట్టింది. వెంటనే అది లోపలికి వెళ్లి చపాతీలా కాలి బయటకు వస్తుంది అంటే ఒక రోటీ నుంచి జిరాక్స్‌లు వచ్చాయన్న మాట. ఈ ఫన్నీ వీడియో ఇపుడు సోసల్ మీడియాను ఓ ఊపు ఊపుతుంది. ఈ వీడియోని ఇప్పటిరకు 3 లక్షలమంది చూశారు. వందల మంది ఆ వీడియోని లైక్ చేశారు. ఈమె తెలివి తెల్లారిందయ్యా బాబు.. ఈమె తెలివికి నోబెల్ ఫ్రైజ్ ఇవ్వాల్సిందే అంటూ తెగ కామెంట్లు వస్తున్నాయి.