Valentines Week ideas: ప్రేమికుల కోసం 7 యూనిక్ రొమాంటిక్ డేట్ ఐడియాలు
Valentines Week ideas: వాలెంటైన్స్ వీక్ సందర్భంగా జంటలు ట్రై చేయగల 7 యూనిక్ రొమాంటిక్ డేట్ ఐడియాలు ఇవే. ప్రేమను మరింత బలపరచే స్పెషల్ ప్లాన్స్.
Valentines Week ideas: ప్రేమికుల కోసం 7 యూనిక్ రొమాంటిక్ డేట్ ఐడియాలు
Valentines Week ideas: వాలెంటైన్స్ వీక్ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకుంటారు. రోజ్ డేతో ప్రారంభమయ్యే ఈ ప్రేమ వారోత్సవం వాలెంటైన్స్ డేతో ముగుస్తుంది. ఈ సందర్భంగా జంటలు ప్రత్యేకంగా సమయం గడపడానికి విభిన్నమైన డేట్ ఐడియాలను అన్వేషిస్తుంటారు. ప్రేమను మరింత బలపరచేందుకు ఉపయోగపడే ఏడు ప్రత్యేక డేట్ ఐడియాలను నిపుణులు సూచిస్తున్నారు.
1. గుర్తుండిపోయే డేట్‌ను మళ్లీ రీక్రియేట్ చేయండి
మీ మొదటి డేట్ లేదా ప్రపోజల్ జరిగిన రోజు వంటి ప్రత్యేక క్షణాన్ని మళ్లీ అనుభవించేందుకు అదే ప్రదేశం, అదే డ్రెస్సింగ్ స్టైల్, అదే ఫుడ్‌తో డేట్ ప్లాన్ చేసుకోవచ్చు.
2. హాబీ క్లాస్‌లో చేరండి
డాన్స్, కుకింగ్ లేదా మీ ఇద్దరికీ ఇష్టమైన ఏదైనా హాబీ క్లాస్‌లో కలిసి పాల్గొనడం ద్వారా కొత్త అనుభవాన్ని పంచుకోవచ్చు.
3. కలిసి పజిల్ పూర్తి చేయండి
ఒక కష్టమైన పజిల్ తీసుకుని కలిసి పూర్తి చేయడం ద్వారా సహనం, టీమ్‌వర్క్ పెరుగుతుంది.
4. పార్ట్నర్‌కు సర్‌ప్రైజ్ లంచ్
కుకింగ్ క్లాస్‌లో నేర్చుకున్న వంటకంతో పార్ట్నర్‌కు ఆఫీసులో సర్‌ప్రైజ్ లంచ్ ఇవ్వడం మంచి అనుభూతిని ఇస్తుంది.
5. సన్‌రైజ్ లేదా సన్‌సెట్ వీక్షణ
ఉదయం సూర్యోదయం లేదా సాయంత్రం సూర్యాస్తమయం కలిసి చూడడం, కాఫీ లేదా ఈవెనింగ్ ట్రీట్‌తో టైమ్ స్పెండ్ చేయడం రొమాంటిక్ అనుభూతిని ఇస్తుంది.
6. వాలంటీర్ సేవలు
పర్యావరణం లేదా సామాజిక సేవ కార్యక్రమాల్లో కలిసి వాలంటీర్‌గా పనిచేయడం ద్వారా బంధం మరింత బలపడుతుంది.
7. రిలేషన్‌షిప్ స్క్రాప్‌బుక్ తయారు చేయండి
ఫోటోలు, టికెట్లు, జ్ఞాపకాలను సేకరించి స్క్రాప్‌బుక్ రూపొందించడం ద్వారా కలిసి గడిపిన క్షణాలను గుర్తు చేసుకోవచ్చు.