Health Tips: ఈ యోగాసనాలతోనూ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.. అవేంటంటే?

Health Tips: యోగా అనేది మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడే శక్తివంతమైన సాధనం. మీరు ఏ యోగాసనాలు వేయాలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.

Update: 2022-01-22 03:15 GMT

 Health Tips: ఈ యోగాసనాలతోనూ రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు.. అవేంటంటే?

Health Tips: యోగా అనేది మన శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడే శక్తివంతమైన సాధనం. అదే సమయంలో యోగా చేయడం వల్ల శరీరం ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. కాబట్టి అది మనకు సంతోషాన్నిస్తుంది. అదే సమయంలో, యోగా ద్వారా రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. ఇలాంటి మీరు ఏ యోగాసనాలు వేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఉస్త్రాసనం - యోగా మ్యాట్‌పై మోకరిల్లి, మీ చేతులను తుంటిపై ఉంచండి. అదే సమయంలో, చేతులు సౌకర్యవంతంగా మారే వరకు వెనుకకు వంచి, అరచేతులను పాదాలపై జారండి. ఈ స్థితిలో కొన్ని క్షణాలు ఉండండి. దీని తరువాత, శ్వాసను వదులుతూ, నెమ్మదిగా మునుపటి స్థితికి రావాలి. ఇప్పుడు చేతులను వెనక్కి తీసుకోండి. అవి నిఠారుగా ఉన్నప్పుడు, వాటిని మీ తుంటిపైకి తీసుకొచ్చి కొద్దిసేపు అలానే ఉండాలి.

చక్రాసనం - మీరు వెనుకభాగంలో పడుకోండి. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి, పాదాలు దృఢంగా ఉండేలా చూసుకోవాలి. అరచేతులను ఆకాశానికి ఎదురుగా ఉంచి, మోచేతుల వద్ద వంచాలి. ఇప్పుడు చేతులను భుజాల మీదుగా కదిలించి, అరచేతులను తలకు ఇరువైపులా నేలపై ఉంచాలి. ఇప్పుడు గాలి పీల్చి అరచేతులు, పాదాలపై ఒత్తిడిని కలిగించాలి. మొత్తం శరీరాన్ని పైకి లేపండి. మెడను రిలాక్స్ చేసి, తలను మెల్లగా వెనక్కి వంచండి.

భుజంగాసనం - మీ పొట్టపై ​​పడుకోండి. ఇప్పుడు నెమ్మదిగా అరచేతుల సహాయంతో తలను పైకి లేపాలి. చేతులు మోచేతుల వద్ద వంగి ఉండాలి. ఇప్పుడు మెడను కాస్త వెనక్కి వంచి పైకి చూడాలి. ఆ తరువాత నేలపై కాలి వేళ్లను నొక్కడం ద్వారా ఒత్తిడిని పెంచాలి. ఈ భంగిమను కొన్ని సెకన్లపాటు అలాగే ఉంచాలి.

Tags:    

Similar News