ఈ విటమిన్‌ లోపం వల్ల కాళ్లు, చేతులలో పెద్ద సమస్య..!

ఈ విటమిన్‌ లోపం వల్ల కాళ్లు, చేతులలో పెద్ద సమస్య..!

Update: 2022-09-23 10:28 GMT

ఈ విటమిన్‌ లోపం వల్ల కాళ్లు, చేతులలో పెద్ద సమస్య..!

Vitamin E: చాలామంది ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చున్నప్పుడు వెనుకభాగంలో విచిత్రమైన జలదరింపుని పొందుతారు. ఇది చాలామందికి చాలాసార్లు జరిగే ఉంటుంది. అలాగే ఒక్కోసారి నరాల్లో నొప్పిగా అనిపిస్తుంది. కానీ ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. వాస్తవానికి శరీరంలో ఒక విటమిన్ లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఆ విటమిన్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

చేతులు కాళ్ళలో జలదరింపులు

చేతులు, కాళ్ళలో జలదరింపులకు అతిపెద్ద కారణం విటమిన్ ఈ లోపం. ఈ పోషకం యాంటీ ఆక్సిడెంట్. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల ఏర్పడే కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. దీన్ని నివారించడానికి విటమిన్ ఈ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తినాలి.శరీరంలో విటమిన్ ఈ లోపం ఉన్నప్పుడు చేతులు, కాళ్ళలో జలదరింపు పెరగడం సాధారణం. దీని లోపాన్ని తీర్చడానికి రోజువారీ డైట్‌లో అనేక ఆహారాలు తీసుకోవచ్చు.

బాదంపప్పులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ప్రజలు వాటిని పచ్చిగా లేదా నానబెట్టి తినడానికి ఇష్టపడతారు. ఇది శారీరకంగానే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా మంచిది.

రోజువారీ భోజనంలో సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను ఉపయోగించాలి. ఇది శరీరానికి పుష్కలంగా విటమిన్ ఈ అందిస్తుంది. కొంతమంది ఈ నూనెను సలాడ్‌లలో కలుపుకొని తీసుకుంటారు. రోజువారీ చిరుతిండిగా తినే వేరుశెనగలలో కూడా విటమిన్ ఈ సమృద్ధిగా లభిస్తుంది. ఆవకాడోలో కూడా విటమిన్‌ ఈ ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News