Children Habit: తల్లిదండ్రులకి అలర్ట్‌.. చిన్నపిల్లల్ని ఇలా చేస్తే ధృడంగా తయారవుతారు..!

Children Habit: నేటి కాలంలో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి సారించడం లేదు.

Update: 2023-02-24 13:30 GMT

Children Habit: తల్లిదండ్రులకి అలర్ట్‌.. చిన్నపిల్లల్ని ఇలా చేస్తే ధృడంగా తయారవుతారు..!

Children Habit: నేటి కాలంలో పిల్లల పెంపకంపై తల్లిదండ్రులు దృష్టి సారించడం లేదు. బిజీ షెడ్యూల్‌ వల్ల వారికి సమయం కేటాయించడం లేదు. దీనివల్ల పిల్లల ఎదుగుదల సరిగ్గా ఉండదు. వారి మానసిక స్థితి, అవయవాల ఎదుగుదలలో లోపాలు ఏర్పడుతాయి. అందుకే పిల్లల్ని పెంచడం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లల్ని తరచుగా ఇంట్లో నడిపిస్తూ ఉండాలి. దీనివల్ల వారికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకుందాం.

చిన్నిపిల్లల పాదాలలో 26 ఎముకలు, 35 కీళ్ళు ఉంటాయి. ఇవి స్నాయువుల ద్వారా అనుసంధానం చేసి ఉంటాయి. వీరు నడవడం ప్రారంభించినప్పుడు వారి పాదాలు చదునుగా ఉంటాయి. చైల్డ్ సైకాలజిస్టుల ప్రకారం పిల్లలు చెప్పులు లేకుండా నడవడానికి అనుమతించాలి. వారి పాదాలు భూమికి కనెక్ట్ అయినప్పుడు ఎర్ర రక్త కణాల పెరుగుదల జరుగుతుంది. ఇది మెరుగైన రోగనిరోధక శక్తికి ముఖ్యమైనది. పిల్లలు చెప్పులు లేకుండా నడిస్తే వారి కాళ్ల కండరాలు దృఢంగా తయారవుతాయి. శరీరం సరైన విధంగా తయారవుతుంది. పుట్టిన సమయంలో పిల్లల పాదాలు పెళుసుగా ఉంటాయి.

పిల్లలు ఎదిగే సమయంలో ఎముకలు, కీళ్ళు బలంగా మారుతాయి. చెప్పులు లేకుండా నడవడం వల్ల పిల్లలకు కండరాలు బలంగా తయారవుతాయి. ఇది కాకుండా నేలతో ప్రత్యక్ష సంబంధంలోకి రావడం వల్ల మెదడు నరాల చివరల ద్వారా సమాచారాన్ని పొందుతుంది. బ్యాలెన్స్‌ను ఎలా సాధించాలో అర్థం చేసుకోవడానికి ఇది వారికి సహాయపడుతుంది. అందుకే చిన్నారులు పాదాలు, చేతులతో వస్తువులను అన్వేషిస్తారు. పాదాల అడుగు భాగంలో దాదాపు 200,000 నరాల చివరలు ఉంటాయని గుర్తుంచుకోండి.

Tags:    

Similar News