Eye Health: అందమైన కళ్లకోసం ఈ విటమిన్లు అత్యవసరం..!

Eye Health: జ్ఞానేంద్రియాలలో కళ్లది మొదటిస్థానం. శరీరంలో ఇవి చాలా సున్నితమైన అవయవాలు. ఇవి లేకుండా ప్రపంచాన్ని చూడలేము.

Update: 2024-03-23 14:00 GMT

Eye Health: అందమైన కళ్లకోసం ఈ విటమిన్లు అత్యవసరం..!

Eye Health: జ్ఞానేంద్రియాలలో కళ్లది మొదటిస్థానం. శరీరంలో ఇవి చాలా సున్నితమైన అవయవాలు. ఇవి లేకుండా ప్రపంచాన్ని చూడలేము. కాబట్టి వీటిని కాపాడుకోవడం చాలా అవసరం. కాని నేటి రోజుల్లో చాలామంది సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లపై గంటల కొద్దీ గడుపుతూ కళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు. అందుకే ఎక్కువ మందికి కంటి అద్దాలు వస్తున్నాయి. వాస్తవానికి కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని విటమిన్ల అవసరం ఉంటుంది. అవి కొన్ని రకాల ఆహారాలలో లభిస్తాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

విటమిన్ ఎ

కంటి చూపును మెరుగుపరచడానికి, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ ఎ అత్యవసరం. ఇందుకోసం క్యారెట్, మామిడి, బొప్పాయి, ఆకు కూరలు వంటి విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాలను ప్రతిరోజు తీసుకోవాలి.

జింక్

జింక్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇందుకోసం నట్స్, ఓట్స్, బీన్స్ మొదలైన వాటిని డైట్ లో చేర్చుకోవాలి. ప్రతిరోజు ఇందులో ఏదో ఒకటి తింటూ ఉండాలి.

ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే ఫుడ్స్ తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందుకోసం చేపలు, చియా విత్తనాలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు తీసుకోవాలి. వారానికి రెండుసార్లయిన చేపల కూర తింటే శరీరానికి ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ అందుతుంది.

విటమిన్ ఇ

విటమిన్ ఇ అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందుకోసం పాలకూర, బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవాలి.

విటమిన్ సి

విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందుకోసం నారింజ, నిమ్మ, బత్తాయి, ఉసిరి వంటి డైట్‌లో చేర్చుకోవాలి. సీజనల్‌ పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి.

Tags:    

Similar News