Before Marriage Tests: వివాహానికి ముందు ఈ టెస్టులు అత్యవసరం.. వధూవరులిద్దరికీ తప్పనిసరి..!

Before Marriage Tests: ఆధునిక కాలంలో పెళ్లిళ్లకు విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు.

Update: 2024-02-15 10:00 GMT

Before Marriage Tests: వివాహానికి ముందు ఈ టెస్టులు అత్యవసరం.. వధూవరులిద్దరికీ తప్పనిసరి..!

Before Marriage Tests: ఆధునిక కాలంలో పెళ్లిళ్లకు విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ఎంత తొందరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడాకులు తీసుకుంటున్నారు. దీనికి కారణం భార్యభర్తల మధ్య అవగాహన లేకపోవడం, చిన్న చిన్న కారణాల వల్ల ఒకరిపై ఒకర నిందలు వేసుకొని విడిపోతున్నారు. అయితే చాలామంది ఆరోగ్య సమస్యల కారణంగా విడిపోతున్నట్లు తెలిసింది. అంటే పెళ్లికి ముందు దాచిన విషయాలు పెళ్లయిన తర్వాత బయటపడడమే ఇందుకు కారణం. అందుకే పెళ్లికి మందు వధూవరులిద్దరు కచ్చితంగా చేయించుకోవాల్సిన నాలుగు పరీక్షలు ఉన్నాయి. ఈ రోజు వాటి గురించి తెలుసుకుందాం.

1. జన్యు వ్యాధి పరీక్ష (Genetic Disease Testing)

పెళ్లికి ముందు మీ జీవిత భాగస్వామి జన్యు వ్యాధి పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలి. ఎందుకంటే వారికి ఏమైనా జన్యుపరమైన వ్యాధులు ఉంటే అది ఒక తరం నుంచి మరొక తరానికి బదిలీ అవుతుంది. జన్యుపరమైన వ్యాధులలో మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, క్యాన్సర్ మొదలైనవి ఉంటాయి.

2. బ్లడ్ గ్రూప్ అనుకూలత పరీక్ష (Blood Group Compatibility Test)

పెళ్లికి ముందు బ్లడ్ గ్రూప్ పరీక్ష కూడా చేయించుకోవాలి. భాగస్వాములిద్దరి బ్లడ్ గ్రూప్ అనుకూలంగా ఉంటే గర్భధారణ సమయంలో మహిళలను వివిధ సమస్యల నుంచి కాపాడవచ్చు.

3. వంధ్యత్వ పరీక్ష (Infertility Test)

పెళ్లికి ముందు వంధ్యత్వ పరీక్ష చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ విషయం సంతానానికి సంబంధించినది. ఈ పరీక్ష ద్వారా పురుషుల స్పెర్మ్ కౌంట్, స్త్రీల అండాశయ ఆరోగ్యాన్ని గుర్తించవచ్చు. ఇది బేబీ ప్లానింగ్‌లో, మెరుగైన శారీరక సంబంధాన్ని కొనసాగించడంలో సహాయపడుతుంది.

4. లైంగిక వ్యాధులు (Sexually Transmitted Disease Test)

కొంతమంది వివాహానికి ముందు లైంగిక సంబంధాలను కలిగి ఉంటారు. దీంతో HIV AIDS, గనేరియా, హెర్పెస్, సిఫిలిస్, హెపటైటిస్ సి వంటి వ్యాధుల ప్రమాదం ఉంటుంది. అందుకే లైంగికంగా సంక్రమించే వ్యాధి పరీక్ష (STDs టెస్ట్) చేయించుకోవడం తప్పనిసరి. లేదంటే వివాహం తర్వాత ఈ వ్యాధులు మీ జీవిత భాగస్వామికి సోకే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News