Stress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?

Stress: ఇటీవల చాలామంది ఉద్యోగం, కుటుంబ పరిస్థితుల వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నారు.

Update: 2022-08-14 10:30 GMT

Stress: ఈ లక్షణాలు కనిపిస్తే తీవ్రమైన ఒత్తిడి.. ఎలా బయటపడాలంటే..?

Stress: ఇటీవల చాలామంది ఉద్యోగం, కుటుంబ పరిస్థితుల వల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. అంతేకాదు వేగవంతమైన జీవితం అంతం లేని కోరికల జాబితా దీనికి కారణమవుతుంది. ఎక్కువ డబ్బు సంపాదించాలనే తపనతో మనిషి తన జీవితంలో శాంతిని కోల్పోతున్నాడు. ఈ కారణంగానే చాలా మంది ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు ఒత్తిడికి గురైనప్పుడు దారుణంగా వ్యవహరిస్తాడు. తీవ్రమైన ఒత్తిడి లక్షణాలను ఎలా గుర్తించవచ్చో తెలుసుకుందాం.

ఒత్తిడి ప్రధాన లక్షణాలు

1. దేనిపైనా దృష్టి కేంద్రీకృతం కాదు

2. తలనొప్పి

3. వెన్నునొప్పి

4. వేగవంతమైన శ్వాస

5. జ్ఞాపకశక్తి కోల్పోవడం

6. అజీర్ణం లేదా మలబద్ధకం

7. సెక్స్ కోరికలు తగ్గడం

ఒత్తిడి లేకుండా ఉండేందుకు చర్యలు

1. ఒత్తిడికి గల కారణాలను గుర్తించండి

2. పని నుంచి కొన్ని రోజులు సెలవు తీసుకోండి

3. మీతో సమయం గడపండి

4. మీకు సంతోషాన్ని కలిగించే వాటిని గుర్తించండి

5. చిన్న చిన్న ప్రయాణాలు చేయండి

6. ఒంటరిగా సమయం గడపండి.

7. తక్కువ ఫాస్ట్ ఫుడ్ తినండి.

8. ఎక్కువ ఆకుపచ్చ కూరగాయలు తినండి

పైన పేర్కొన్న పద్ధతులను అనుసరించినా మీకు ఉపశమనం లభించకపోతే చింతించకండి. మంచి మానసిక వైద్యుడిని కలవండి. ఎందుకంటే చాలా సార్లు ఒత్తిడికి కారణం శరీరంలో సంతోషకరమైన హార్మోన్లు స్రవించకపోవడమే. అనేక కారణాల వల్ల శరీరంలో డోపమైన్, సెరటోనిన్ వంటి సంతోషకరమైన హార్మోన్ల స్రావం తగ్గుతుంది. దీని కారణంగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ పరిమాణం పెరుగుతుంది. వ్యక్తి తీవ్రమైన ఒత్తిడికి గురవుతాడు.

Tags:    

Similar News