Vitamin-D: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్‌ డి ఎక్కువగా తీసుకున్నట్లు..!

Vitamin-D: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్‌ డి ఎక్కువగా తీసుకున్నట్లు..!

Update: 2022-07-14 05:30 GMT

Vitamin-D: ఈ లక్షణాలు కనిపిస్తే విటమిన్‌ డి ఎక్కువగా తీసుకున్నట్లు..!

Vitamin-D: ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి అనేక రకాల ఖనిజాలు, విటమిన్లు అవసరం. అందులో విటమిన్-డి ఒకటి. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడటంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్-డి శరీరంలో కాల్షియంను బాగా గ్రహించడంలో సహయపడుతుంది. అంతేకాదు కండరాల కణాలకు ఇది అవసరం. విటమిన్-డి సూర్యకిరణాల ద్వారా లభిస్తుంది. అయితే దీనిని కొన్ని సప్లిమెంట్ల ద్వారా కూడా తీసుకోవచ్చు. కానీ మీరు నిరంతరం విటమిన్-డి సప్లిమెంట్లను తీసుకుంటే అది శరీరంలో దాని పరిమాణాన్ని పెంచుతుంది. ఈ పరిస్థితిలో శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి గురించి తెలుసుకుందాం.

శరీరంలో విటమిన్-డి అధికంగా ఉంటే కడుపుకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. మీరు నిరంతరం విటమిన్-డిని ఎక్కువగా తీసుకున్నప్పుడు దాని ప్రభావం మీ జీర్ణవ్యవస్థపై పడుతుంది. విటమిన్-డి తీసుకోవడం వల్ల రక్తంలో కాల్షియం స్థాయి పెరుగుతుంది. దీని వల్ల కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, వాంతులు, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడుతాయి.

మీ శరీరంలో విటమిన్-డి అధికంగా ఉన్నప్పుడు మీరు సంతోషంగా ఉండలేరు. తరచుగా వాంతులు, విరేచనాలు, మలబద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీని కారణంగా మీరు నిరంతరం అలసిపోతారు. విటమిన్-డి అధికంగా ఉండటం వల్ల అంతా గందరగోళంగా ఉంటుంది. సరైన నిర్ణయం తీసుకోలేరు. ఉల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో విటమిన్ డి అధికమవుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. దాహం ఎక్కువగా ఉంటుంది.

Tags:    

Similar News