Tea: టీ తాగేటప్పుడు వీటిని అస్సలు తినకూడదు..!

Tea: టీ తాగేటప్పుడు వీటిని అస్సలు తినకూడదు..!

Update: 2022-04-11 13:30 GMT

Tea: టీ తాగేటప్పుడు వీటిని అస్సలు తినకూడదు..!

Tea: చాలామంది ఉదయమే టీతో రోజుని ప్రారంభిస్తారు. కొందరి ఇళ్ళల్లో అయితే గంట గంటకు కూడా టీ తాగుతూ ఉంటారు. కొంతమంది టీ తాగడంతోపాటు బిస్కెట్లు ఎక్కువగా తింటారు. అయితే టీతో పాటు కొన్ని పదార్థాలు అస్సలు తినకూడదు. శరీరానికి చాలా హానికరం. అయితే టీ తాగే వాళ్ళు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

టీలో నిమ్మకాయని ఎప్పుడూ ఉపయోగించవద్దు

టీలో నిమ్మకాయను ఉపయోగించడం మంచిది కాదు. మీరు టీతో నిమ్మరసాన్ని తీసుకుంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది. ఈ రెండింటి కలయిక చాలా హానికరం.

పసుపు పదార్థాలని తినకూడదు..

ఇది కాకుండా పసుపుతో చేసిన పదార్థాలని టీతో తినకూడదు. ఎందుకంటే పసుపు టీతో రసాయన ప్రతిచర్యను పొందుతుంది. ఇది మన శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

టీతో డ్రై ఫ్రూట్స్ తినకూడదు

టీతో డ్రై ఫ్రూట్స్ తీసుకోకూడదు. ఎందుకంటే డ్రై ఫ్రూట్స్‌లో ఉండే ఐరన్ టీతో ప్రతిచర్యని కొనసాగిస్తుంది. ఇది శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

పచ్చికూరగాయలు, ఆకు కూరలు

మీరు టీ తాగడానికి ముందు కానీ టీ తాగిన తర్వాత కానీ ఆకుకూరల్ని, పచ్చి కాయగూరల్ని అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ కనుక మీరు అలా తీసుకున్నట్లయితే పచ్చి కూరలో ఉండే గోయిట్రోజన్లు ఇబ్బంది తీసుకొస్తాయి. దీని వల్ల ఐయోడిన్ లోపం కలుగుతుంది.

మొలకెత్తిన గింజలు

మొలకెత్తిన గింజలు ఆరోగ్యానికి చాలా మంచిదని ఎప్పుడు పడితే అప్పుడు తింటారు. అయితే నిజానికి మొలకెత్తిన గింజలు టీ తో తీసుకోకూడదు. ఇందులో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది భాస్వరం మూలకంగా ఇది పనిచేస్తుంది కాబట్టి టీతో పాటు మొలకెత్తిన గింజలు తీసుకోకూడదు

Tags:    

Similar News