Health Tips: వంటగదిలోని ఈ పదార్థాలు స్లో పాయిజన్.. అవేంటంటే..?

Health Tips: వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలని ప్రతిరోజు ఆహారం తయారీలో వాడుతారు.

Update: 2022-11-04 05:21 GMT

Health Tips: వంటగదిలోని ఈ పదార్థాలు స్లో పాయిజన్.. అవేంటంటే..?

Health Tips: వంటగదిలో ఉండే కొన్ని పదార్థాలని ప్రతిరోజు ఆహారం తయారీలో వాడుతారు. దాదాపు ఇవిలేనిదే ఏ వంట పూర్తికాదని చెప్పవచ్చు. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు వీటిని తీసుకుంటారు. అయితే వీటిని అతిగా వాడటం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది.. ఇది మీకు తెలియకుండానే జరుగుతుంది. మీరు గుర్తించేలోపు ఆస్పత్రిలో ఉంటారు. అలాంటి కొన్ని ఆహారాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

చక్కెర

ప్రతి ఇంట్లో చక్కెర లేకుండా ఏ పనిసాగదు. ఉదయం టీ నుంచి మొదలుపెడితే స్నాక్స్‌లో తినే బిస్కెట్ల వరకు ఇది కావాల్సిందే. అంతేకాదు ఏదైనా తీపి ఆహారం, పానీయాలు తయారు చేయడానికి చక్కెరను కలపాల్సి ఉంటుంది. చక్కెరను అధికంగా వాడటం వల్ల అధిక రక్తపోటు, వాపు, బరువు పెరగడం, మధుమేహం, ఫ్యాటీ లివర్ సమస్యలు ఏర్పడుతాయి. గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

మైదా పిండి

దాదాపు ప్రతి ఇంట్లో మైదా పిండిని ఉపయోగిస్తారు. రోజులో ఎక్కడో చోట మీరు మైదాతో చేసిన ఆహారాన్ని తినాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా మైదా పిండిని వాడితే మలబద్ధకం మాత్రమే కాదు బరువు కూడా పెరుగుతారు. జీర్ణ సంబంధిత సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్‌కు గురవుతారు.

ఉప్పు

ఉప్పు ప్రతి వంటకంలో ఉండాల్సిందే. కొంతమంది కూరలో వేసినది సరిపోక తినేటప్పుడు అదనంగా వేసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. ఉప్పు ఎక్కువైతే బీపీ పెరుగుతుంది. ఉప్పు తక్కువగా తినడం వల్ల అనేక సమస్యలను దూరం చేసుకోవచ్చు.

వాడిన నూనె

ఒకసారి వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడకూడదు. ఇది అనేక రకాల వ్యాధులకి కారణం అవుతుంది. దీని వల్ల గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రకరకాల క్యాన్సర్లకి గురికావాల్సి ఉంటుంది. అందుకే దీనికి దూరంగా ఉంటే మంచిది.

Tags:    

Similar News