Diabetes: చక్కెరే కాదు.. ఇవి కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతాయి..!
Diabetes: ప్రపంచాన్ని భయపెడుతోన్న అనారోగ్య అంశాల్లో డయాబెటిస్ ఒకటి. భారతదేశంలో రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది.
Diabetes: ప్రపంచాన్ని భయపెడుతోన్న అనారోగ్య అంశాల్లో డయాబెటిస్ ఒకటి. భారతదేశంలో రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ఒక్కసారి ఈ వ్యాధి బారిన పడితే తగ్గడం అంత సులువు కాదు. అందుకే జీవన విధానంలో మార్పులు చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే చాలా మంది తియ్యగా ఉండే చక్కెర, స్వీట్లను తీసుకుంటే షుగర్ లెవల్స్ పెరగడానికి కారణమవుతుందని భావిస్తుంటాం. అయితే వీటితో పాటు మరికొన్ని ఆహార పదార్థాలు కూడా రక్తంలో చక్కెర స్థాయి పెరగడానికి కారణమవుతుందని మీకు తెలుసా.? అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* వైట్ రైస్ తియ్యగా లేకపోయినా ఇది రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. ప్రతిరోజు అధిక మొత్తంలో వైట్ రైస్ తినడం మధుమేహం ఉన్నవారికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట అన్నానికి దూరంగా ఉండాలని అంటున్నారు.
* బంగాళదుంపలు ఆరోగ్యానికి మంచివైనా వాటిలో అధికంగా స్టార్చ్ ఉంటుంది. ఈ కారణంగా ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు బంగాళదుంపలను తక్కువగా తీసుకోవాలి.
* బిస్కెట్లు, పాస్తా, సమోసాలు వంటి ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. వీటిలో పోషకాలు తక్కువగా ఉంటాయి, గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని తగ్గించడం ఉత్తమం.
* వేపుడు పదార్థాలు మధుమేహ రోగుల ఆరోగ్యానికి చాలా హానికరం. ఇవి రక్తంలో చక్కెర స్థాయిని పెంచడమే కాకుండా, మలబద్ధకం వంటి సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* డయాబెటిస్ పేషెంట్స్ స్వీట్లను తక్కువగా తీసుకోవాలి. చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో ఉంటుంది.
ఈ టిప్స్ పాటించండి..
మధుమేహ రోగులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువగా పచ్చి కూరగాయలు, పంచదార తక్కువగా ఉన్న ఫుడ్‌ను తీసుకోవాలి. పిండి పదార్థాలు, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి. తీసుకునే ఆహారంతో పాటు జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా వాకింగ్, యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.