Eyesight: కంటి చూపుని మెరుగుపరిచే ఈ పండ్లు తింటున్నారా.. అవేంటంటే?

Eyesight: రుచికరమైన పండ్లు, గింజలను ఎంత ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి అంత మేలు చేస్తాయి.

Update: 2022-08-05 12:30 GMT

Eyesight: కంటి చూపుని మెరుగుపరిచే ఈ పండ్లు తింటున్నారా.. అవేంటంటే?

Eyesight: రుచికరమైన పండ్లు, గింజలను ఎంత ఎక్కువగా తింటే అవి ఆరోగ్యానికి అంత మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలోని ప్రతి భాగానికి మేలు చేకూరుతుంది. కంటి చూపు మెరుగవుతుంది. చిన్న గింజలో ఎన్నో పోషకాలు దాగి ఉంటాయి. వాల్‌నట్‌లు కళ్లకు మేలు చేస్తాయి. వీటిని తినడం వల్ల కళ్ల కండరాలకు ఉపశమనం కలుగుతుంది. ఇందులో విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇది కళ్ల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

బాదం

బాదం మెదడు ఆరోగ్యానికి, జ్ఞాపకశక్తికి ప్రసిద్ధి చెందింది. కానీ ఇది కంటి చూపును పెంచడంలో సహాయపడుతుంది. బాదంపప్పులో విటమిన్-ఇ పుష్కలంగా లభిస్తుంది. ఇది కాకుండా ఇది ప్రోటీన్‌కి మంచి మూలం. రాత్రిపూట నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల కంటిచూపు పెరగడంతో పాటు కంటి నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే బాదం పప్పును పరిమితంగా తినాలి. ఎందుకంటే బాదం తినడం వల్ల కొవ్వు పెరుగుతుంది.

నేరేడు పండ్లు

నేరేడు పండ్లలో బీటా కెరాటిన్ ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. బీటా కెరాటిన్ కళ్ల వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా నేరేడు పండులో విటమిన్ సి, విటమిన్ ఇ ఉంటాయి. జింక్, కాపర్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి.

క్యారెట్‌

బీటా కెరోటిన్ కంటి చూపును పెంచడంలో బాగా సహాయపడుతుంది. క్యారెట్‌లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపు పెరగాలంటే రోజూ తాజా క్యారెట్లను తినాలి.

స్వీట్ పొటాటో

స్వీట్ పొటాటోలో బీటా కెరోటిన్, విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి. ఇది కాకుండా బ్రోకలీ, బచ్చలికూర కళ్ళకు మేలు చేస్తాయి.

Tags:    

Similar News