Blood Pressure: బీపీతో చింత వద్దు.. ఈ పానీయాలు తీసుకుంటే చాలు..!

Blood Pressure: రక్తపోటును నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

Update: 2022-05-05 14:30 GMT

Blood Pressure: బీపీతో చింత వద్దు.. ఈ పానీయాలు తీసుకుంటే చాలు..!

Blood Pressure: రక్తపోటును నియంత్రించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అయితే కొన్ని పానీయాలు తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. వాస్తవానికి మీరు ఆహారంపై శ్రద్ధ చూపనప్పుడు లేదా వ్యాయామం చేయనప్పుడు మీకు ఈ రకమైన సమస్య ఉంటుంది. హై బీపీ కానీ లో బీపీ కానీ హెల్తీ డ్రింక్స్‌ తీసుకుంటే కంట్రోల్‌ అవుతుంది. అటువంటి పానీయాల గురించి తెలుసుకుందాం.

1. క్యారెట్ జ్యూస్

రక్తపోటు నియంత్రణలో ఉండాలంటే మీరు తప్పనిసరిగా క్యారెట్ జ్యూస్ తాగాలి. దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుంది. BP కంట్రోల్‌లోకి వస్తుంది. నిజానికి క్యారెట్ జ్యూస్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, సి అలాగే అనేక అవసరమైన పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి.

2. కాఫీ తాగాలి

ఇది కాకుండా ప్రతిరోజు ఖచ్చితంగా కాఫీని తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. అంతే కాకుండా అలసట, నీరసం కూడా కాఫీ వల్ల తగ్గుతాయి.

3. నీటిలో ఉప్పు వేసి తాగాలి

మీరు లో బీపీ తో బాధపడుతుంటే నీటిలో ఉప్పు వేసి తాగాలి. ఇలా చేయడం వల్ల బీపీ కంట్రోల్‌లోకి వస్తుంది.

4. బీట్‌రూట్‌ జ్యూస్‌

బీట్ రూట్‌ జ్యూస్ లోబీపీ సమస్యకి చక్కటి పరిష్కరం. ఈ జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే బీపీ కంట్రోల్ లో ఉండటమే కాకుండా రక్తహీనత కూడా ఉండదు.

Tags:    

Similar News