Children Best Diet: పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా మారాలంటే డైట్‌లో వీటిని కచ్చితంగా చేర్చాలి.. అవేంటంటే..?

Children Best Diet: నేటి రోజుల్లో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులు వారిని సరిగ్గా పట్టించుకోకపోవడమే.

Update: 2024-01-18 16:00 GMT

Children Best Diet: పిల్లల బ్రెయిన్ షార్ప్‌గా మారాలంటే డైట్‌లో వీటిని కచ్చితంగా చేర్చాలి.. అవేంటంటే..?

Children Best Diet: నేటి రోజుల్లో చాలామంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీనికి కారణం తల్లిదండ్రులు వారిని సరిగ్గా పట్టించుకోకపోవడమే. ఈ వేగవంతమైన జీవనశైలిలో చాలామంది పిల్లల కోసం సమయం కేటాయించడం లేదు. దీంతో వారు మానసికంగా, శారీరకంగా ఇబ్బందిపడుతున్నారు. దీంతో వారి ఎదుగుదలలో సమస్యలు ఎదురవుతున్నాయి. పిల్లల డైట్‌ అనేది చాలా శక్తివంతంగా ఉండాలి. తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల మెదడుపై నెగిటివ్‌ ప్రభావం పడుతుంది. దీనివల్ల ఆలోచించే, అర్థం చేసుకునే శక్తి తగ్గుతుంది. పిల్లల మెదడుకు పదును పెట్టడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఈ రోజు తెలుసుకుందాం.

ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డ తెలివిగా మారాలని కోరుకుంటారు. ఇందుకోసం వారికి ప్రతిరోజు పాలు అందించాలి. వీటివల్ల శరీరం దృఢంగా మారుతుంది. పాలలో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడును పదును పెట్టడానికి ఉపయోగపడుతాయి. పిల్లల ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను చేర్చాలి. నానబెట్టిన బాదంపప్పును రోజూ తీసుకోవడం వల్ల మెదడు వేగంగా పని చేస్తుంది. శరీర పొడవును పెంచడానికి ఉపయోగపడుతాయి. ఎదిగే పిల్లల ఆహారం ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలి.

పిల్లలు బయటి వస్తువులను తినకుండా ఎల్లప్పుడూ ఆపాలి. జంక్ ఫుడ్ మెదడుపై చెడు ప్రభావం చూపుతుంది. పెరుగుతున్న శరీరానికి మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. పిల్లలకు పచ్చి కూరగాయలు తినేలా చేయాలి. ఇందులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తికి పదును పెడతాయి. పండ్ల వినియోగం చాలా ముఖ్యం. వీటిని తీసుకోవడం వల్ల శరీరం బలపడుతుంది. మెదడు అభివృద్ధి చెందుతుంది. పిల్లల ఆహారంలో సీజనల్ పండ్లను తప్పనిసరిగా చేర్చాలి. ప్రతి రోజూ ఉదయం పిల్లలకు తప్పనిసరిగా పండ్లు తినేలా చూడాలి. గుడ్లు, పెరుగు తినడం వల్ల పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు అభివృద్ధి చెందడానికి ఇవి ఉత్తమమైన ఆహారాలు. గుడ్డులో ప్రోటీన్, విటమిన్ డి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి.

Tags:    

Similar News