Brain Health: మెదడు షార్ప్‌గా పనిచేయాలంటే ఇవి తినాలి.. అవేంటంటే..?

Brain Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడు. ఇది శరీరంలోని ఇతర భాగాలను నియంత్రిస్తుంది. గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ ప్రక్రియ, చేతులు, కాళ్ల కదలికలు అన్నీ మెదడు సూచనల మేరకే జరుగుతాయి.

Update: 2023-11-30 15:00 GMT

Brain Health: మెదడు షార్ప్‌గా పనిచేయాలంటే ఇవి తినాలి.. అవేంటంటే..?

Brain Health: మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం మెదడు. ఇది శరీరంలోని ఇతర భాగాలను నియంత్రిస్తుంది. గుండె కొట్టుకోవడం, జీర్ణక్రియ ప్రక్రియ, చేతులు, కాళ్ల కదలికలు అన్నీ మెదడు సూచనల మేరకే జరుగుతాయి. కాబట్టి మెదడు సరిగ్గా పనిచేయకపోతే శరీరం మొత్తం స్తంభించిపోతుంది. అందువల్ల మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం మెదడుకు మేలు చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గుడ్లు

గుడ్లు మెదడు కణాల పెరుగుదల, పనితీరును మెరుగుపరిచే కోలిన్ అనే పోషకాన్ని కలిగి ఉంటాయి. ఇది న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. గుడ్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడుకు శక్తిని అందిస్తాయి. ఇందులో ఐరన్, జింక్, సెలీనియం, అయోడిన్, విటమిన్ బి12 పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ జ్ఞాపకశక్తిని పెంచుతాయి. గుడ్లు తినడం వల్ల ఏకాగ్రత స్థాయి పెరుగుతుంది.

బాదం, వాల్ నట్స్

విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు బాదంలో పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. కొత్త కణాల ఏర్పాటును ప్రోత్సహిస్తాయి. మెదడుకు శక్తిని అందిస్తాయి. వాల్‌నట్స్‌లో మెదడుకు మేలు చేసే విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీ డైట్‌లో ఈ రెండు డ్రై ఫ్రూట్స్‌ని చేర్చుకోవడం వల్ల మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

తాజా పండ్లు, కూరగాయలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, బ్రోకలీ, క్యారెట్ వంటి కూరగాయల్లో మెదడు కణాలను రక్షించే యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ఆలోచనా శక్తిని పెంచడంలో సహాయపడతాయి. కూరగాయల్లో ఉండే పీచు పదార్థాలు మెదడుకు మేలు చేస్తాయి. వీటిల్లో మెదడుకు మేలు చేసే ఫోలేట్, ఐరన్, జింక్, విటమిన్ కె వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి.

పాల ఉత్పత్తులు

మెదడు కణాల అభివృద్ధికి, పనితీరుకు అవసరమైన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12, విటమిన్ D వంటి పోషకాలు పాలలో, పాత ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయి. ఇవి మెదడుకు శక్తిని అందించే అవసరమైన కొవ్వు ఆమ్లాలను అందిస్తాయి. పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి మెదడు సంబంధిత సమస్యలతో పోరాడడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News