Health Tips: ఈ ఆహారాలకి దూరంగా ఉంటే ఉత్తమం.. లేదంటే గుండెపోటు తప్పదు..!

Health Tips: ఈ ఆహారాలకి దూరంగా ఉంటే ఉత్తమం.. లేదంటే గుండెపోటు తప్పదు..!

Update: 2023-05-14 06:22 GMT

Health Tips: ఈ ఆహారాలకి దూరంగా ఉంటే ఉత్తమం.. లేదంటే గుండెపోటు తప్పదు..!

Health Tips: నేటి కాలంలో చెడు కొలస్ట్రాల్‌ ఆరోగ్యానికి అతిపెద్ద శత్రువు. ఇది ఊబకాయాన్ని పెంచుతుంది. ఆపై అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ వ్యాధి, ట్రిపుల్ నాళాల వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే మనల్ని మనం శారీరకంగా చురుకుగా ఉంచుకోవడం అవసరం. రోజువారీ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలనుకుంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం మంచిది. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఫుల్ ఫ్యాట్ మిల్క్ ప్రొడక్ట్

పాలు సంపూర్ణ ఆహారం అనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఫుల్ ఫ్యాట్ డైరీ ప్రొడక్ట్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అధిక కొవ్వు పాలు, క్రీమ్ పెరుగు నుంచి దూరంగా ఉండాలి. చీజ్‌లో సంతృప్త కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా తినవద్దు.

2. రెడ్ మీట్

రెడ్ మీట్ సాధారణంగా బాడీలో ప్రొటీన్ అవసరాలను తీర్చుతుంది. అయితే ఇందులో కొవ్వు పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ఎరుపు మాంసం వండడానికి చాలా నూనె, సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి.

3. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్

భారతీయ ప్రజలు వేయించిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతారు. దీనివల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా మార్కెట్లలో లభించే డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిని తినడం మానుకోవాలి.

4. చక్కెర

చక్కెరతో తయారైన వస్తువులు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తాయి. అయితే ఇది ఆరోగ్యానికి పెద్ద శత్రువు. తీపి పదార్థాలు తక్కువగా తినాలి. ఎందుకంటే అవి కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి.

Tags:    

Similar News