Health Tips: చలికాలం ఈ ఆహారాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: చలికాలం ఈ ఆహారాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Update: 2022-12-20 04:30 GMT

Health Tips: చలికాలం ఈ ఆహారాలు ఇమ్యూనిటీని పెంచుతాయి.. కచ్చితంగా డైట్‌లో ఉండాల్సిందే..!

Health Tips: చలికాలంలో చాలామంది అనారోగ్యానికి గురవుతారు. అందుకే క్లినిక్‌ల వద్ద ప్రజలు రద్దీగా కనిపిస్తారు. ఇటువంటి పరిస్థితిలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కొందరికి చలి, జలుబు, మరికొందరికి నెలల తరబడి ముక్కుకారుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నందున తొందరగా జబ్బులకి గురవుతారు. శీతాకాలంలో కొన్ని రకాల ఆహారాలను కచ్చితంగా తీసుకోవాలి. ఇవి శరీరంలో ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.

ఆహారంలో మార్పులు

ఈ సీజన్‌లో కాలుష్య సమస్య ఎక్కువగా ఉన్నందున ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతారు. కాలుష్యం వల్ల ఆస్తమా, జలుబు-దగ్గు వంటి వ్యాధులు వస్తాయి. హార్ట్ పేషెంట్లు చలికాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ ఇ, విటమిన్ సి, బీటా కెరోటిన్ వంటి వాటిని చేర్చుకోవాలి. కలోంజీలో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి కాకుండా శీతాకాలంలో మిరియాలు, లవంగాలను ఉపయోగించాలి. వీటిని బెల్లంతో కలిపి తీసుకోవచ్చు.

వెల్లుల్లి, ఉల్లిపాయల ప్రభావం వేడిగా ఉంటుంది. శీతాకాలంలో వీటిని తింటే చాలా ప్రయోజనం పొందుతారు. వెల్లుల్లి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శీతాకాలంలో అనేక సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. జలుబు సమస్యను ఎదుర్కోవటానికి ఉల్లిపాయ రసంలో బెల్లం కలిపి తినాలి. తొందరగా ఉపశమనం పొందుతారు. ఉసిరి రసం రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పనిచేస్తుంది. దీంతో ఊపిరితిత్తుల సమస్య తొలగిపోతుంది.

Tags:    

Similar News