Health Tips: ఈ ఆహారాలు రాత్రిపూట నిద్రకి ఆటంకం కలిగించవు..!

Health Tips: రాత్రిపూట చక్కగా నిద్రపట్టాలంటే డిన్నర్‌లో ఏం తింటామో వాటిపై ఆధారపడి ఉంటుంది.

Update: 2022-06-26 14:30 GMT

Health Tips: ఈ ఆహారాలు రాత్రిపూట నిద్రకి ఆటంకం కలిగించవు..!

Health Tips: రాత్రిపూట చక్కగా నిద్రపట్టాలంటే డిన్నర్‌లో ఏం తింటామో వాటిపై ఆధారపడి ఉంటుంది. చాలామంది రకరకాల ఫుడ్స్‌ తిని అర్ధరాత్రి నిద్రపట్టక ఇబ్బందిపడుతుంటారు. జీర్ణక్రియకు భంగం కలిగించే ఆహారాన్ని తింటే ఉదయాన్నే పొట్టను క్లియర్ చేయడంలో సమస్య ఉంటుంది. దీనివల్ల మలబద్ధకం లేదా లూజ్ మోషన్ ఏర్పడుతుంది. సరైన ఆహారం ఎంచుకోకపోవడం వల్ల రాత్రిపూట నిద్ర పాడవుతుంది. అయితే రాత్రి ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం.

మీ విందు చాలా తేలికగా, జీర్ణమయ్యేలా ఉండాలి. అంటే రాత్రి భోజనం చేసిన తర్వాత కడుపులో భారంగా ఉండకూడదు. తద్వారా మీరు బాగా నిద్రపోవచ్చు. డిన్నర్‌లో తినే ఆహార పదార్థాలు గ్యాస్ ఉత్పత్తి చేయకూడదు. ఎందుకంటే ఇది నిద్రిస్తున్నప్పుడు కడుపు నొప్పికి కారణమవుతుంది. అంతేకాదు నిద్రలేమికి కూడా కారణం అవుతుంది.

డిన్నర్ చాలా కారంగా కూడా ఉండకూడదు. ఇది డీహైడ్రేషన్ సమస్యని సృష్టిస్తుంది. రాత్రి తరచుగా దాహం ఉండవచ్చు. రాత్రి భోజనంలో తేలికపాటి సుగంధ ద్రవ్యాలు, ఆవు పాలతో తయారు చేసిన దేశీ నెయ్యిని ఉపయోగించాలి. ఓట్స్ లేదా శనగ పిండితో చేసిన ఆహారాలని ఉపయోగించవచ్చు. పప్పు, చపాతీ అన్ని విధాల బాగుంటుంది. అలాగే బ్రోకలీ, కొబ్బరి, పుదీనా ఉపయోగించిన వంటకాలు సులభంగా జీర్ణమవుతాయి. 

Tags:    

Similar News