Health Tips: కిడ్నీ దెబ్బతినడానికి ఇవే ప్రధాన కారణాలు.. అవేంటంటే..?

* శరీర అవయవాలలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని కాపాడుకోపోతే చాలా అనర్థాలు జరుగుతాయి.

Update: 2022-11-16 00:54 GMT

కిడ్నీ దెబ్బతినడానికి ఇవే ప్రధాన కారణాలు.. అవేంటంటే

Health Tips: శరీర అవయవాలలో మూత్రపిండాలు చాలా ముఖ్యమైన అవయవాలు. వీటిని కాపాడుకోపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. అనేక వ్యాధులు మిమ్మల్ని చుట్టుముడతాయి. నేటి కాలంలో చాలా మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ రకమైన సమస్య వెనుక తగినంత నిద్ర లేకపోవడం, తగినంత వాటర్‌ తాగకపోవడం, ఇంకా కొన్ని చెడ్డ అలవాట్లు దాగి ఉన్నాయి. కిడ్నీలు మన శరీరానికి యోధులవంటివి. ఇవి శరీరం నుంచి వ్యర్థ ద్రవాలను తొలగించడానికి సహాయపడుతాయి. వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం ఈ రోజే ఈ చెడు అలవాట్లను వదిలేయండి.

నీటి కొరత:

శరీరంలో తగినంత నీరు ఉండాలి. అవసరాన్ని బట్టి కచ్చితంగా నీరు తాగాలి. లేదంటే మూత్రపిండాలు, కాలేయం సహా చాలా అవయవాలు దెబ్బతింటాయి. తగినంత ద్రవం ఉన్నప్పుడే మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తాయి. శరీరంలో నీటి కొరత ఉంటే కిడ్నీకి సంబంధించిన అనేక సమస్యలు ఎదురవుతాయి. కిడ్నీ కాలేయ మార్పిడి కూడా రావచ్చు.

తగినంత నిద్ర:

ఒక మనిషి పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటే తగినంత నిద్ర అవసరం. సైన్స్ ప్రకారం ఒక రాత్రి నిద్ర లేకపోయినా అది మూత్రపిండాలని ప్రభావితం చేస్తుంది. అంతేకాదు దీని కారణంగా కాలేయం గ్లూకోజ్‌ను తయారు చేయలేకపోతుంది. అందుకే కచ్చితంగా సరిపడ నిద్ర అవసరమని గుర్తుంచుకోండి.

ధూమపానం, మద్యపానం:

ఆల్కహాల్ నేరుగా మీ కాలేయాన్ని, మూత్రపిండాలని దెబ్బతీస్తుంది. ఇది ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ఈ అలవాటుని వదులుకోలేరు. ధూమపానం కాలేయంపై విష ప్రభావాన్ని చూపుతుంది. మద్యపానం, ధూమపానం చేసే వ్యక్తుల అవయవాలు రోజు రోజుకి బలహీనంగా మారుతాయి.

Tags:    

Similar News