Skin Care Tips: ఈ అలవాట్లు చర్మానికి హాని చేస్తాయి.. ఈ రోజే వదిలేయండి..!

Skin Care Tips: అందమైన చర్మం పొందడానికి ప్రతిఒక్కరు అన్ని ప్రయత్నాలు చేస్తారు.

Update: 2023-02-16 15:30 GMT

Skin Care Tips: ఈ అలవాట్లు చర్మానికి హాని చేస్తాయి.. ఈ రోజే వదిలేయండి..!

Skin Care Tips: అందమైన చర్మం పొందడానికి ప్రతిఒక్కరు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అనేక రకాల హోం రెమిడీస్‌ని పాటిస్తారు. బ్యూటీ ప్రొడాక్ట్స్‌ వాడుతారు. అయినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కారణం మీరు పాటించే చెడ్డ అలవాట్లు. కొన్ని అలవాట్లు ఆరోగ్యానికే కాకుండా చర్మానికి హాని కలిగిస్తాయి. ఈ పరిస్థితిలో వాటిని మానుకోవడం ఉత్తమం. అలాంటి అలవాట్ల గురించి ఈరోజు తెలుసుకుందాం.

అధికంగా ఈత కొట్టడం

చాలా మందికి ఎక్కువగా స్విమ్మింగ్ చేసే అలవాటు ఉంటుంది. కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ఈత చర్మంతో పాటు జుట్టును దెబ్బతీస్తుంది. స్విమ్మింగ్ పూల్ నీటిలో క్లోరిన్ ఎక్కువగా కలుపుతారు. ఇది చర్మం, జుట్టును పాడుచేస్తుంది. చాలా మంది ఇంటికి వెళ్లి స్నానం చేయడం వల్ల దీని ప్రభావం ముగుస్తుంది అని అనుకుంటారు. కానీ అందులో నిజంలేదు.

వేడి నీటి స్నానం

మీరు స్నానం చేయడానికి అధిక వేడి నీటిని ఉపయోగిస్తే అది మీ చర్మం, జుట్టుకు నష్టం కలిగిస్తుంది. వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. జుట్టు తేమ కోల్పోతుంది.

ధూమపానం

చాలా మందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది. అయితే మరికొంతమంది సిగరెట్‌ తాగే వ్యక్తల దగ్గర ఉంటారు. ఆ సిగరెట్‌ పొగ వారికి హాని చేస్తుంది. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే ధూమపానం అలవాటును వదిలివేయాలి. స్మోకింగ్‌ చేసేవారి దగ్గర ఉండకూడదు.

మద్యపానం

ఈ రోజుల్లో చాలామంది ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు. దీనివల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. తేమ కోల్పోయి ముడతలు పడటం ప్రారంభమవుతుంది. అందుకే ఈ చెడ్డ అలవాటుని మానుకోవడం ఉత్తమం.

Tags:    

Similar News