Kidney Health: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండలా.? రోజూ ఈ పనులు చేయండి చాలు..!

Kidney Health: శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిడ్నీల పనితీరు బాగుంటేనే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

Update: 2025-01-18 10:56 GMT

Kidney Health: శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు కూడా ఒకటని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కిడ్నీల పనితీరు బాగుంటేనే శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలు బయటకు వెళ్తాయి. లేదంటే ఎన్నో సమస్యలకు దారి తీస్తుంటాయి. ప్రస్తుతం మారిన జీవన విధానంతో పాటు తీసుకుంటున్న ఆహారంలో వస్తున్న మార్పుల కారణంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ కిడ్నీల ఆరోగ్యం పదిలంగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి.? జీవన విధానంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

* కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా బెర్రీలు, ఆకుకూర‌లు, ఆలివ్ ఆయిల్ వంటివి ఉండేలా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా రోజూ ఉదయాన్నే ఇలాంటి ఫుడ్‌ను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కిడ్నీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఉదయం టిఫిన్‌లో పండ్లు, కూర‌గాయ‌లు, తృణ ధాన్యాల‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్‌ను తీసుకోవడం వల్ల కిడ్నీలు సులభంగా బయటకు పోతాయి.

* హెర్బల్‌ టీలను రెగ్యులర్‌గా తీసుకుంటే కిడ్నీల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ కణాలను కాపాడుతాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నిర్మూలించడంలో దోహదపడుతుంది. శ‌రీరంలోని వ్య‌ర్థాలు సుల‌భంగా బ‌య‌ట‌కు పోయేలా చేస్తుంది. హెర్బల్‌ టీ షుగర్‌ లెవల్స్‌ను నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. అలాగే కిడ్నీల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

* శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత ముఖ్యమో నీరు కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతుంటారు. రోజూ ఉదయం లేవగానే కచ్చితంగా నీరు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఉదయం లేవగానే కాఫీలు, టీలు తాగుతుంటారు. దీనివల్ల కిడ్నీల పనితీరుపై ప్రభావం పడుతుంది. అయితే వీటికి బదులుగా మంచి నీటిని తాగితే కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుంది.

* వీటన్నింటితో పాటు వ్యాయామం కూడా కచ్చితంగా అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రోజూ క‌నీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. వాకింగ్‌ను కచ్చితంగా లైఫ్‌ స్టైల్‌లో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News