Banana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!

Banana Problems: అరటిపండుని పేదోడి పండు అంటారు. ఎందుకంటే సామాన్యులకి అందుబాటులో ఉండే పండు.

Update: 2022-08-19 16:00 GMT

Banana Problems: అరటిపండు అతిగా తింటే వచ్చే సమస్యలు ఇవే..!

Banana Problems: అరటిపండుని పేదోడి పండు అంటారు. ఎందుకంటే సామాన్యులకి అందుబాటులో ఉండే పండు. అంతేకాదు ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు అరటిపండు అంటే ఇష్టపడుతారు. ఇందులో మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, ఫైబర్, ప్రోటీన్స్, బి6, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అరటి పండ్లు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కానీ ఏదైనా అతిగా తింటే అనర్థమే. అరటిపండు ఎక్కువగా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుందాం.

ఎక్కువగా అరటిపండ్లు తినడం వల్ల మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. ఇందులో ఉండే హానికర సమ్మేళనాలు మైగ్రేన్ ని ప్రేరేపిస్తాయి. డయాబెటీస్‌ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే ఇందులో ఉండే ఫ్రక్టోజ్ రక్తంలో చెక్కర స్థాయిలను పెంచుతుంది. దీని పలు సమస్యలు ఏర్పుడుతాయి. అతిగా అరటి పండు తినడం వల్ల బరువు పెరుగుతారు. అరటిపండులో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల హైపర్ కలేమియాని ఉత్పత్తి చేస్తుంది.

అరటిలో ఫైబర్ మెండుగా ఉండటం వల్ల ఇది గ్యాస్, కడుపు ఉబ్బరానికి కారణమవుతుంది. అరటి పండుని ఎక్కువగా తీసుకోవడం వల్ల దంత క్షయం ఏర్పడుతుంది. తక్కువ సమయంలో రెండు అరటి పండ్లు వెంట వెంటనే తింటే నరాలకు హాని కలుగుతుంది. కిడ్నీ సమస్యలున్నవారు అరటి పండ్లకు దూరంగా ఉండటమే మేలు. అందుకే రోజుకి కేవలం రెండు అరటి పండ్లకి మించి తినడం ఆరోగ్యానికి హానికరం.

Tags:    

Similar News