Dandruff Problem: మీరు చేసే ఈ తప్పులే చుండ్రుకి కారణం.. ఈ రోజే వదిలేయండి..!

Dandruff Problem: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా చెడిపోతుంది.

Update: 2023-02-28 01:30 GMT

Dandruff Problem: మీరు చేసే ఈ తప్పులే చుండ్రుకి కారణం.. ఈ రోజే వదిలేయండి..!

Dandruff Problem: నేటి జీవనశైలి, ఆహారపు అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టు కూడా చెడిపోతుంది. తలలో చుండ్రు సమస్య మొదలవుతుంది. సాదారణంగా అందరు చుండ్రును తొలగించడానికి యాంటీ డాండ్రఫ్ షాంపూలను వాడుతారు. కానీ ఇది మంచి పద్దతి కాదు. జుట్టులో చుండ్రు రావడానికి గల కారణాలని తెలుసుకుంటే సులభంగా దానిని నివారించవచ్చు. అవేంటో తెలుసుకుందాం.

హార్డ్ షాంపూలను ఉపయోగించడం

మీరు రోజూ కఠినమైన, రసాయనాలు అధికంగా ఉండే షాంపూలను ఉపయోగిస్తే అది తలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా జుట్టులో చుండ్రు సమస్య తలెత్తుతుంది. ఈ పరిస్థితిలో తేలికపాటి, హెర్బల్ షాంపూని ఉపయోగించడం ఉత్తమం.

వేడి నీటి వాడకం

శీతాకాలంలో వేడినీటి స్నానం వల్ల తలలోని తేమ మొత్తం ఆరిపోతుంది. దీని కారణంగా చుండ్రు సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది కాకుండా తలపై స్కార్ఫ్‌లు, క్యాప్‌లు ధరించడం వల్ల తగినంత గాలి అందక చుండ్రు సమస్యకు మొదలవుతుంది.

థైరాయిడ్ సమస్య

జుట్టులో చుండ్రు సమస్యకు థైరాయిడ్‌ కూడా కారణం అవుతుంది. దీనివల్ల స్కాల్ప్ డ్రైగా మారి జుట్టు విరగడం, రాలడం మొదలవుతుంది.

జిడ్డుగల జుట్టు

స్కాల్ప్ జిడ్డుగా ఉంటే చుండ్రు సమస్య చుట్టుముడుతుంది. ఎందుకంటే ఇది స్కాల్ప్‌ను జిగటగా ఉంచుతుంది. దీని వల్ల జుట్టులో మురికి పేరుకుపోతుంది. ఇది చుండ్రును ఆహ్వానిస్తుంది. జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. ఈ పరిస్థితిలో వేయించిన ఆహారాలని తినడం మానుకోవాలి.

Tags:    

Similar News