Summer Foods: వేసవిలో హీట్‌ స్ట్రోక్‌ నివారణకి ఇవి సూపర్ ఫుడ్స్‌..!

Summer Foods: భారతదేశంలో ఏప్రిల్‌, మే నెలలో ఎండలు దంచికొడుతాయి. చాలామంది ఈ వేడికి తట్టుకోలేకపోతారు.

Update: 2022-04-17 11:00 GMT

Summer Foods: వేసవిలో హీట్‌ స్ట్రోక్‌ నివారణకి ఇవి సూపర్ ఫుడ్స్‌..!

Summer Foods: భారతదేశంలో ఏప్రిల్‌, మే నెలలో ఎండలు దంచికొడుతాయి. చాలామంది ఈ వేడికి తట్టుకోలేకపోతారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు హీట్‌స్ట్రోక్‌కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ పరిస్థితిలో బయటికి వెళ్లే ముందు సూపర్‌ ఫుడ్స్‌ తీసుకొని వెళ్లాలి. దీంతో హీట్ స్ట్రోక్ నుంచి తప్పించుకోవచ్చు. అందువల్ల నీటి శాతం ఎక్కువగా ఉన్న పండ్లని ఈ సీజన్‌లో ప్రతిరోజు తినాలి. శరీరానికి చలువ చేసే ఆహారపదార్థాలని డైట్‌లో చేర్చుకుంటే మంచిది. అలాంటి కొన్నింటి గురించి తెలుసుకుందాం.

1.మొక్కజొన్న: మొక్కజొన్నలో విటమిన్ సి, మెగ్నీషియం, ఫైబర్ మొదలైన అనేక పోషక అంశాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ జీర్ణవ్యవస్థ చాలా బాగుంటుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని మెరుగ్గా పనిచేసేలా చూస్తుంది. డయాబెటీస్‌ పేషెంట్లు కూడా మొక్కజొన్న తినవచ్చు.

2. దోసకాయ: వేసవికాలంలో దోస చేసే మేలు మరే పండు చేయదు. ఎందుకంటే ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దోసకాయ శరీరంలోని వేడిని తీసేసి చల్లబరుస్తుంది. ఇందులో ఉండే అధిక నీటి కంటెంట్ మిమ్మల్ని మరింత హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది.

3. పనసపండు: పనసపండులో పోషకాలు సమృద్ధిగా దొరుకుతాయి. వేసవి కాలంలో ఇది రక్తపోటుని తగ్గించడంలో సహాయపడుతుంది. మంచి జీర్ణక్రియకి దోహదం చేస్తుంది. ఎండాకాలం బయటికి వెళ్లే ముందు పనస తిని వెళితే చాలా మంచిది.

4. పుచ్చకాయ: వేసవిలో మరొక చెప్పుకోదగ్గ పండు పుచ్చకాయ. ఇందులో కూడా నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. పుచ్చకాయ మీ శరీరాన్ని హైడ్రేట్ చేస్తుంది. పుచ్చకాయలో సోడియం, పొటాషియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి.

5. పెరుగు: వేసవి కాలంలో వడగాలులు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాంటి సమయంలో పెరుగు మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చాలా ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

Tags:    

Similar News